English   

ఆ బాలీవుడ్ హీరోయిన్ కోసం అర్ధరాత్రి విజయ్ దేవరకొండ..

Vijaydevarakonda Bollywood.jpg
2019-10-12 15:03:38

విజయ్ దేవరకొండ ఏంటి.. అర్ధరాత్రి బాలీవుడ్ హీరోయిన్ కోసం ఏంటి అనుకుంటున్నారా.. వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజం. ఇప్పుడు విజయ్ దేవరకొండ స్వయంగా వోగ్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు బయట పెట్టాడు. ఒక బాలీవుడ్ హీరోయిన్ ఫోన్ నెంబర్ కోసం అర్ధరాత్రి పడిగాపులు కాసిన సంగతి ఏ మాత్రం మొహమాటం లేకుండా బయట పెట్టాడు ఈ సెన్సేషనల్ హీరో. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్.. ఈ మధ్య వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిశాడు. అక్కడే ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కు పెద్ద అభిమానిని అని చెప్పాడు. ఆమె నటించిన గల్లీబాయ్ సినిమా చూసి ఫిదా అయిపోయానని.. అందులో అలియా నటనకు తాను పడిపోయానని చెప్పాడు విజయ్ దేవరకొండ.

ఆ సినిమా చూసిన తర్వాత వెంటనే ఆమెతో మాట్లాడాలని అనిపించిందని.. అందుకే ముందు వెనకా చూసుకోకుండా సమయం కూడా పట్టించుకోకుండా తనకు బాలీవుడ్ లో అత్యంత సన్నిహితుడు అయిన కరణ్ జోహార్ కి ఫోన్ చేసి అలియా భట్ నెంబర్ అడిగాను అని చెప్పాడు విజయ్ దేవరకొండ. ఈ సమయంలో ఫోన్ చేస్తే అవతలి వాళ్ళు ఎవరు అని కూడా చూడకుండా అలియాభట్ బండబూతులు తిడుతుందని.. కరణ్ చెప్పడంతో కాస్త కామ్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఇదే విషయం తర్వాత ఒక ఫంక్షన్లో అలియాభట్ ను కలిసినప్పుడు విజయ్ దేవరకొండ చెబితే ఆమె కూడా తనకు చురకలు అంటించిందని సరదాగా నవ్వుకుంటూ చెప్పాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈమె తెలుగులో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కేవలం తాను రాజమౌళిపై ఉన్న గౌరవంతో చేస్తున్నానని చెప్పింది అలియా భట్.

More Related Stories