వాడికి స్కూల్స్.. నాకు షూటింగ్ ఒకేసారి అంటున్న మహేష్..

టాలీవుడ్ లో బెస్ట్ ఫ్యామిలీ పర్సన్ ఎవరంటే మరో ఆలోచన లేకుండా మహేష్ బాబు అని చెప్పాలి. ఎందుకంటే ఈయనకు ఏ మాత్రం షూటింగ్ లో టైమ్ దొరికినా వెంటనే కుటుంబాన్ని తీసుకుని విదేశాలకు వెళ్లిపోతాడు. దొరక్కపోయినా దొరికించుకుని మరీ వెళ్తుంటాడు. మొన్నామధ్య దసరా హాలీడేస్ ఉండటంతో ఫ్యామిలీతో పాటు విదేశాలకు వెళ్లిపోయాడు సూపర్ స్టార్. తన పిల్లలతో కలిసి తాను కూడా పిల్లాడైపోయాడు సూపర్ స్టార్. ఫారెన్ లో ఫ్యామిలీతో ఈయన ఎంజాయ్ చేసిన ఫోటోలు కొన్ని నెట్ లో దర్శనమిస్తున్నాయి. వాటిని చూస్తుంటే మహేశ్ ఎంత చిన్న పిల్లాడో అర్థమైపోతుంది. ఓ ఫోటోలో తనయుడు గౌతమ్ తో కలిసి తాను కూడా గాల్లో తేలిపోతున్నాడు. మరో ఫోటోలో ఒక్కడే ఎగురుతూ షార్ట్ వేసుకుని యంగ్ హీరోలా పోజిచ్చాడు. వయసు 40 దాటినా ఇప్పటికీ మహేశ్ మాత్రం కుర్రాడిలాగే కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో మిగిలిన వాళ్లున్నా కూడా కేవలం తనపైనే ఫోకస్ ఉండేలా పోజిచ్చాడు సూపర్ స్టార్. దసరా సంబరాలు ముగించుకుని ఇండియాకు వస్తున్నాడు మహేశ్. గౌతమ్ కు స్కూల్స్.. నాకు షూటింగ్స్ మళ్లీ ఓపెన్ అయ్యాయి అంటూ ట్వీట్ కూడా చేసాడు సూపర్ స్టార్. వచ్చీ రాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సెట్ లో అడుగుపెట్టనున్నాడు. సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ పూర్తి చేయబోతున్నాడు అనిల్. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.