English   

అల వైకుంఠపురములో రిలీజ్ డేట్ లాక్...పోటీకి వస్తారా

aa
2019-10-12 19:54:47

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉందన్న విషయం క్లారిటీ ఉంది. అయితే సంక్రాంతి కి రిలీజ్ అవుతుంది అనే ప్రచారం ఉన్నా డేట్ మాత్రం ఇప్పటివరకూ చెప్పలేదు. ఫైనల్ గా ఈ రోజు రిలీజ్ డేట్ ను కూడా రివీల్ చేసేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12 వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్నీ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి.

వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా మీద మరింత అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో కూడా తండ్రి సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ అని గాసిప్స్ రావడంతో సినిమా మీద మరింత అంచనాలు పెతుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సామజవరగమనా పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పోటీకి మహేష్ సరిలేరు నీకెవ్వరు వస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ యూనిట్ ఇంకా డేట్ ప్రకటించలేదు కాబట్టి ప్రస్తుతానికి అది రూమర్ అనే చెప్పుకోవాలి.

More Related Stories