English   

సైరా అక్కడ దారుణమైన డిజాస్టర్.. నమ్మడం కష్టమే..

syeraa
2019-10-12 20:09:12

తొలిరోజు నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఫ్లాప్ అయితే దర్శక నిర్మాతలు పెద్దగా బాధపడరు. ఎందుకంటే ముందు నుంచి ఫ్లాప్ టాక్ బయటికి వచ్చేసింది.. కాబట్టి జనాలు చూడలేదు అనుకుంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో.. 200 కోట్లకు పైగా బడ్జెట్.. తొలిరోజే బ్లాక్బస్టర్ టాక్.. ఇంతకంటే ఇంకేం కావాలి. కానీ సైరా నరసింహారెడ్డికి ఇది కూడా సరిపోలేదు. అంత అద్భుతమైన టాక్ తో ఓపెన్ అయిన సైరా ఇప్పుడు డిజాస్టర్ కావడానికి సిద్ధంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లు తీసుకొస్తుంది. కానీ ఓవర్సీస్లో మాత్రం చాలా తక్కువ కలెక్షన్లు తీసుకొచ్చింది. ఎందుకో తెలియదు కానీ కొన్ని రోజులుగా ఓవర్సీస్ ఆడియన్స్ తెలుగు సినిమాల వైపు చూడటం లేదు. ఒకప్పుడు రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాలు సంచలన కలెక్షన్లు తీసుకువచ్చాయి.

ఇక బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు వస్తే కచ్చితంగా ఓవర్సీస్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు అనేది నిజం అని చాలా సినిమాలు నిరూపించాయి. కానీ ఎందుకో మరి సైరా నరసింహారెడ్డి విషయంలో మాత్రం అది ప్రూవ్ కాలేదు. ఈ సినిమా అక్కడ 3.5 మిలియన్ తీసుకొస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. కానీ ప్రస్తుతం 2.5 మిలియన్ దగ్గరే ఉంది ఈ చిత్రం. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఓవర్సీస్ లో ప్రయాణం ముగిసినట్లే కనిపిస్తోంది. కానీ జరిగితే నిర్మాతలకు భారీ షాక్ తప్పదు. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 1 మిలియన్ పైగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 3.5 రేటింగ్ వేసిన సినిమాకు కూడా ఇంత దారుణమైన కలెక్షన్లు వస్తే మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి అని తల పట్టుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు.

More Related Stories