రెండో షెడ్యూల్ మొదలెట్టేసిన ఒరేయ్ బుజ్జిగా

గుండె జారి గల్లంతయిందే, ఒక లైలా కోసం లాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించి టాలెంటేడ్ డైరెక్టర్ అనిపించుకున్న విజయ్ కుమార్ కొండా చాన్నాళ్ళగా సినిమాలకి దూరంగా ఉన్నాడు. దాదాపు ఐదు సంవత్సరాలు ఆయన ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదు. అయితే ఆయన అనూహ్యంగా కుర్ర హీరో రాజ్ తరుణ్ తో తన కొత్త సినిమా ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంది.
ఇక ఈ సినిమాకి 'ఒరేయ్.. బుజ్జిగా' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు అప్పుడే నిర్మాతలు ప్రకటించారు. ఇక మొదటి షెడ్యూల్ జరుపుకుని మళ్ళీ ఈరోజే రెండో షెడ్యూల్ మొదలయ్యింది. ఇక ఈ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతుందట. రాజ్ తరుణ్ ఎనర్జీకి తగిన లవ్‌స్టోరీ అని అంటున్నారు. సినిమాలకి గ్యాప్ ఇచ్చిన వాణీవిశ్వనాథ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. గత కొంత కాలంగా సక్సెస్ లేని అనూప్ రూబెన్స్ ఈ సినిమాక్ సంగీతం అందిస్తున్నారు. నిజానికి హీరో రాజ్ తరుణ్ - డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా అలాగే నిర్మాత కేకే.రాధామోహన్ - అనూప్ రూబెన్స్ వీళ్ళు నలుగురూ హిట్ కోసం పరితపిస్తున్నారు. ఈ సినిమా ఈ నలుగురికి ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.