English   

మహేష్ బాబు, అల్లు అర్జున్.. సంక్రాంతికి నువ్వా నేనా..

allu
2019-10-12 21:15:08

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే క‌చ్చితంగా క‌లెక్ష‌న్ల‌పై ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని తెలుసు. అవి స్టార్ హీరోల సినిమాలైతే న‌ష్టం మ‌రింత ఎక్కువ‌గానే ఉంటుంది. అందుకే ఒకేరోజు ఇద్దరు స్టార్స్ వ‌చ్చే ధైర్యం ఈ మ‌ధ్య కాలంలో ఎప్పుడూ చేయ‌లేదు. కానీ ఇప్పుడు బ‌న్నీ, మ‌హేష్ చేస్తున్నారు. ఈ ఇద్ద‌రు కోపంగా వ‌స్తున్నారో.. ఆలోచించే వ‌స్తున్నారో.. లేదంటే పంతానికి పోతున్నారో తెలియడం లేదు కానీ ఒకేరోజు వ‌స్తున్నారు. 2020, జనవరి 12న సరిలేరు నీకెవ్వరుతో పాటు బ‌న్నీ న‌టిస్తోన్న అల వైకుంఠపురములో విడుద‌ల కానుంది. ఈ మేర‌కు ఇద్ద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ డేట్స్ ను క‌న్ఫ‌ర్మ్ చేసారు. వెన‌క్కి త‌గ్గే స‌మ‌స్యే లేదంటున్నారు వీళ్లు. పైగా ఒకే రోజు కొన్ని గంటల గ్యాప్ లోనే విడుదల తేదీలను ట్విట్టర్ లో ప్రకటించారు.

నిజానికి మహేష్ బాబు మొదట సంక్రాంతికి వస్తానని చెప్పాడు. ఆ తర్వాత బన్నీ కూడా తాను కూడా పండక్కే వస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒకేరోజు వస్తారని మాత్రం అనుకోలేదు. కనీసం మూడు నాలుగు రోజులు గ్యాప్ తీసుకుని వస్తారేమో అనుకుంటే ఒకేరోజు వస్తున్నామని చెప్పడం మాత్రం నిజంగానే సంచలనం. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఇదే సమయంలో బన్నీ సినిమా కూడా చివరిదశకు వచ్చేసింది. రెండు సినిమాలు కచ్చితంగా పండక్కి రావడం ఖాయం. ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకేరోజు వస్తే మాత్రం కచ్చితంగా కోట్లలో నష్టం తప్పదు. మరి చూడాలిక.. చివరివరకు ఏం జరగబోతుందో..?

More Related Stories