English   

కమెడియన్ శ్రీనివాసరెడ్డి, యాంకర్ స్వప్నలకి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్

ttd
2019-10-13 10:23:25

ఇప్పటికే సాక్షి లో పనిచేసే చాలా మందిని ప్రభుత్వంలోని నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారికి ప్రభుత్వం నుండి పెద్ద మొత్తంలో జీతాలు ఇస్తున్నట్టు జగన్ మీద ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నా ఆయన మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనను నమ్ముకున్న వాళ్లకు తనకు తోచిన రీతిలో అవకాశం ఇస్తున్నాడు. ఈ క్రమంలో సాక్షి న్యూస్ రీడర్, యాంకర్ స్వప్నను ఎస్వీబీసీ చానెల్ డైరెక్టర్‌గా నియమించారు. ఆమెతో పాటు సినీ నటుడు శ్రీనివాసరెడ్డి కూడా డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఛానల్‌ ఛైర్మన్‌గా పృధ్వీరాజ్‌ బలిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నియమించింది.

ఆయనతో కలిసి ఈ డైరెక్టర్లు ఇద్దరూ కలిసి పనిచేయనున్నారు. ఎస్వీబీసీ బోర్డులో ఛైర్మన్‌తో పాటు తితిదే ధర్మకర్తల మండలి సభ్యులను డైరెక్టర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ జగన్ మాత్రం ఇతరులుకి అవకాశం ఇచ్చారు. దూరదర్శన్ లో యాంకర్ గా మొదలుపెట్టిన స్వప్న, ఆ తర్వత టీవీ9లో యాంకర్‌గా పదేళ్లకు పైగా  పనిచేసి ఆ తర్వాత సాక్షి ఛానెల్‌లో మారింది. ఇక తెలంగాణకు చెందిన కమెడియన్ శ్రీనివాసరెడ్డి గురించి పెద్దగా తెలియని వారు ఎవరూ ఉండరు. టాలీవుడ్ లో ప్రాధాన్యత ఉన్న కామెడీ రోల్స్ చేస్తూ జయమ్ము నిశ్చయమ్ము రా సినిమాతో హీరోగా మారాడు. ఆ తరువాత అంజలి లీడ్ రోల్ చేసిన హరర్ మూవీ గీతాంజలిలోనూ హీరోగా నటించి మెప్పించారు.  

 

More Related Stories