English   

చిరంజీవి సంచలన నిర్ణయం

Chiranjeevi New Challenge.jpg
2019-10-13 13:37:33

మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. ఖైది నెంబర్ 150 సినిమా తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. మొన్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా సినిమా రిలీజ్ కాగా అది మిగతా బాషలలో ఎలా ఉన్నా తెలుగులో సంచలన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక సైరా పూర్తికాగానే లేట్ చేయకుండా పండగ రోజుఅన కొరటాలతో సినిమా మొదలు పెట్టేశారు. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది . 

మెగాస్టార్ కోసం కొరటాల ఇప్పటికే మంచి యాక్షన్ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీని రెడీ చేసాడు. ఇందులో తన పాత్ర కోసం చిరు బరువు తగ్గనున్నారట. ఈ సినిమా అయిపోగానే వెంట వెంటనే మొదలయ్యేలా వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు చిరు. తన 153 వ సినిమాని వినియ విదేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్ఫర్మ్ చేసాడు చిరు. త్రివిక్రమ్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని అప్పుడే చెప్పుకొచ్చారు. 

ఇక ఈ రెండు సినిమాలు కాకుండా చిరు సుకుమార్, లవకుశ ఫేం బాబీ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ ల కధలు కూడా విన్నాడని అంటున్నారు.ఇక నుండి పూర్తి సమయం సినిమాలకే కేటాయించి ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలని చిరు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు బోయపాటి శ్రీనుతో చిరు ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలయ్యతో సినిమా కంప్లీటైన తర్వాత బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమా ఉండే అవకాశం ఉంది. అయితే వినయ విదేయ రామ సినిమా ఎఫెక్ట్ తో అది పట్టాలు ఎక్కుతుందో లేదో ? అనేది తేలాలి.

More Related Stories