English   

రంజుగా మారిన సంక్రాంతి ఆ ఇద్దరు హీరోలతో పోటీకి నందమూరి హీరో

kalyanram
2019-10-13 19:24:56

అలవైకుంఠపురములో మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారో లేదో ఇలా సంక్రాంతి బరిలో బస్తీ మే సవాల్ అంటూ వచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇక మీరిద్దరూ దిగితే నేనెందుకు దిగలేను అనుకున్నాడో ఏమో ఇక నేను కూడా ఉన్నానంటూ కళ్యాణ్ రామ్ కూడా తన సినిమా డేట్ ప్రకటించాడు. ప్రతి సంక్రాంతి మాదిరిగానే 2020 సంక్రాంతి బాక్సాఫీస్ వార్ కూడా మంచి రంజుగా మారింది.

 అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘అల వైకుంఠపురంలో’, మహేష్-అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ రెండిటికే సినీ జనాలు టెన్షన్ పడిపోతుంటే జనవరి 12 ఈ ఇద్దరితో పటు మరి కుర్ర హీరో కూడా ఢీ కొట్టబోతున్నారు. బన్నీ మహీష్ లతో పాటు కళ్యాణ్ రామ్‌ కూడా ‘ఎంత మంచి వాడవురా’ అంటూ తన పందెం పుంజును రెడీ చేసుకున్నారు. 2020 సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్‌ 'సరిలేరు నీకెవ్వరు', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ 'అల వైకుంఠపురములో' మరో సూపర్ స్టార్ రజనీ కాంత్ 'దర్బార్‌ సినిమాలతో పాటు నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కూడా 'ఎంత మంచి వాడవురా' సినిమాతో రెడీ అయ్యాడు.

More Related Stories