English   

రేపు జగన్ ని కలవనున్న చిరు...తీవ్ర చర్చనీయాంశం

chiru
2019-10-13 21:39:33

రేపు ఏపీ సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవి బేటీ ఆసక్తిని రేపుతోంది. సైరా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి ఆ సినిమా చూడమని ఆహ్వానించేందుకు జగన్ ను కలవబోతున్నారు. మామూలుగా అయితే ఇది సాధారణ విషయం. కానీ జగన్-చిరంజీవి మధ్య గతంలో ఎప్పుడూ స్నేహ సంబంధాలు లేవు. పైగా పవన్ కల్యాణ్ ఆయనుకు ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఇద్దరి సమావేశం చర్చనీయాంశమైంది. రేపు తాడేపల్లి వెళ్తున్న చింరంజీవి, రాం చరణ్ సీఎం నివాసంలో జగన్ ను కలవబోతున్నారు. సైరా సినిమా ఎక్కువ షోలు ప్రదర్శించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దానికి కృతజ్ఞతలు చెప్పడంతోపాటు సినిమా చూడాలని జగన్ ను చిరంజీవి కోరబోతున్నారు.

అయితే గతంలో ఎప్పుడూ వీరిద్దరి మధ్య ఇలాంటి భేటీలు జరగకపోవడమే ఇప్పటి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జగన్ తో చిరంజీవికి నేరుగా ఎప్పుడూ విభేదాలు, వివాదలు లేకపోయినా.. చెప్పుకోదగ్గ స్థాయిలో స్సేహ సంబంధాలు కూడా లేవు. 2009లో ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే అదే ఏడాది కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు జగన్. సోనియాతో విభేదించి కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వెళ్తే ప్రజారాజ్యం పార్టీని క్లోజ్ చేసి కాంగ్రెస్ లో చేరిపోయి జగన్ వర్గంలేని లోటు తీర్చారు చిరంజీవి. 2009 ఎన్నికల్లో యువ రాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ కల్యాణ్ అప్పటి సీఎం వైఎస్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. పంచెలు ఊడగొడతామంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు.

అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి, వైఎస్ ఫ్యామిలీకి మధ్య విభేదాలు లేకపోయినా సఖ్యత కూడా లేకుండాపోయింది. చిరంజీవి కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి అయ్యాక కూడా కాంగ్రెస్ కు జగన్ ప్రత్యర్ధిగా ఉన్నా చిరంజీవి ఎప్పుడూ ఆయన్ను విమర్శించలేదు. 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టుకున్న పవన్ కల్యాణ్.. టీడీపీ, బీజేపీలతో కలిసి వైసీపీతో తలపడ్డారు. అప్పటి నుంచి జగన్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు పవన్. జగన్ ఎలా సీఎం అవుతారో చూస్తానని పగన్ అంటే కార్లు మార్చినట్టు భార్యలను మార్చారు పవన్ అంటూ పవన్ మీద వ్యక్తిగత విమర్శలు చేసే వరకు జగన్ వెళ్లారు.

ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇలా ఎవరికి వారు అన్నట్టుగా ఉన్న ఈ రెండు ఫ్యామిలీలు ఇప్పుడు కలవడమే ఆసక్తిగా మారింది. జగన్ తో చిరంజీవి భేటీ కాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పేరుతో వచ్చిన ఓ సోషల్ మీడియా పోస్ట్ హీట్ ఎక్కించింది. జగన్ అరెస్ట్ సమయంలో చట్టం తన పని తాను చేసుకుపోయిందని రాం చరణ్‌ ట్వీట్ చేశారని.... ఇప్పుడు అదే రాం చరణ్ తండ్రితో కలిసి జగన్ ను కలవాలని అనుకోవడం కాల మహిమ అంటూ చెవిరెడ్డి పేరుతో వచ్చిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జగన్-చిరు భేటీ పై పాత విషయాల ఎఫెక్ట్ ఎంత ఉంటుందోనన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.  

 

More Related Stories