English   

మెగా హీరో దెబ్బకు ఇండస్ట్రీ మార్చేసిన వక్కంతం వంశీ..

vamsi
2019-10-14 04:49:17

పాతికేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉండి.. ఎట్ట‌కేల‌కు ద‌ర్శ‌కుడిగా మారాడు వ‌క్కంతం వంశీ. ర‌చ‌యిత‌గా చాలా సినిమాల‌కు స‌క్సెస్ ఫుల్ క‌థ‌లు అందించిన వంశీ.. ద‌ర్శ‌కుడిగా మాత్రం బొక్క‌బోర్లా ప‌డ్డాడు. సిన్సియ‌ర్ అటెంప్ట్ అంటూ బ‌న్నీకి దారుణ‌మైన డిజాస్ట‌ర్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. నా పేరు సూర్య‌తో వ‌క్కంతం క‌ల‌ల‌న్నీ ఆవిరైపోయాయి. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో 8 నెల‌లుగా ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు వంశీ. రెండో సినిమా కోసం క‌నీసం ఏ హీరోకు క‌థ చెప్పాలో కూడా తెలియ‌ని కన్ప్యూజ‌న్ లో ఉన్నాడు వక్కంతం. రైట‌ర్ గా ఓకే కానీ ద‌ర్శ‌కుడిగా ఈయ‌న ప‌నికిరాడ‌ని నా పేరు సూర్య చూసిన త‌ర్వాత చాలా మంది విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు వంశీపై. అంతేకాదు.. చిన్న బ‌డ్జెట్ సినిమా చేయ‌కుండా ఏకంగా స్టార్ హీరోతో భారీ బ‌డ్జెట్ సినిమా చేసి ఆ న‌ష్టాల‌కు బాధ్యుడ‌య్యాడంటూ బాగానే ఆడిపోసుకున్నారు ఈ ద‌ర్శ‌కున్ని.

దాంతో రెండో అవ‌కాశం కోసం వంశీ చాలానే క‌ష్ట‌ప‌డుతున్నాడు ఇప్పుడు. ఆ మధ్య ర‌వితేజ కోసం క‌థ రాసాడ‌ని.. ఇప్ప‌టికే మాస్ రాజా ఆమోదం కోసం వేచి చూస్తున్నాడ‌ని వార్తలొచ్చాయి. గ‌తంలో కిక్.. కిక్ 2.. ట‌చ్ చేసి చూడు సినిమాల‌కు క‌థ‌లు అందించాడు వంశీ. అయితే ఇప్పుడు మాత్రం ఈయన ఏకంగా ఇండస్ట్రీ మార్చేసాడని.. ప్రస్తుతం కన్నడలో అదృష్టం పరీక్షించుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. మరి అక్కడైనా మనోడి పొలంలో మొలకలు వస్తాయో లేదో చూడాలిక.

More Related Stories