English   

లవ్ స్టోరీ బయటపెట్టిన నిఖిల్.. ఆమె ఓ డాక్టర్.. 

 Hero nikhil
2019-10-14 10:18:39

మంచులక్ష్మి హోస్టుగా వ్యవహరిస్తున్న తెలుగు రియాలిటీ షో ఫీట్‌ అప్‌ విత్‌ స్టార్స్‌ . టీవీలో రాకపోయినా కూడా యాప్ లో కనిపిస్తుంది ఈ షో. సెలెబ్రిటీస్ పర్సనల్ విషయాలతో పాటు బెడ్రూమ్ ముచ్చట్లు కూడా చెప్పిస్తుంది లక్ష్మి ఇందులో. ఇప్పటికే రకుల్, సమంత లాంటి వాళ్లు సంచలన విషయాలు బయటపెట్టారు. ఇప్పుడు నిఖిల్ కూడా ఇదే చేసాడు. ఈయన కూడా తన పర్సనల్ విషయాలు చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ షోలో పాల్గొన్న ఈ కుర్ర హీరో.. తన ప్రేమ జీవితం విశేషాలను మంచు లక్ష్మితో పంచుకున్నాడు. 'నా జీవితంలో ఆ అమ్మాయి చాలా స్పెషల్‌. తను ఒక డాక్టర్‌. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. నేను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు కానీ, స్నేహితులతో సరదాగా గడుపుతున్నప్పుడు కానీ తను నన్ను డిస్టర్బ్‌ చేయదు. నా ఫోన్‌ కూడా చెక్‌ చేయదు. 'నువ్వు ఎప్పుడు సరదాగా గడపాలి అనుకుంటే అప్పుడు గడుపు' అని తను నాతో చెప్పింది. ప్రతిఒక్కరికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది అనే విషయాన్ని తను నమ్ముతుంది. అదే నాకు తనలో బాగా నచ్చింది.' అని నిఖిల్‌ తెలిపారు. అంతేకాకుండా చిన్నప్పుడు షారుక్‌ ఖాన్‌ సినిమాలు చూసినప్పటి నుంచి ప్రేమ పెళ్లి మీద ఇష్టం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే అన్నీ చెప్పినా కూడా తన పెళ్లెప్పుడు అనేది మాత్రం చెప్పలేదు నిఖిల్. త్వరలోనే అది కూడా జరగబోతుంది. 

More Related Stories