English   

ఒకే వేదికను పంచుకోనున్న జగన్, బాలకృష్ణ, ప్రభాస్.. 

YS jagan
2019-10-14 13:43:43

వినడానికి కాస్త కొత్తగా అనిపించినా కూడా కాలం కలిసొస్తే ఇదే జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా వాళ్లను కలవాల్సిన బాధ్యత కూడా జగన్ పైనే ఉంది. అసలు విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు ప్రతీ ఏడాది ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులకు నంది పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీ. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2011లో చివరిసారిగా ఏపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించి.. వాటిని నటీనటులకు అందచేసింది. అప్పట్నుంచి మళ్లీ ఇప్పటి వరకు నందులు ఇవ్వలేదు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2012-13 రెండు సంవత్సారాలకు కలిపి నంది అవార్డులను ప్రకటించారు. అయితే అప్పుడు చాలా రచ్చ జరిగింది కూడా. 2012కు గాను 'ఎటో వెళ్లిపోయింది మనసు' సినిమాలో నటనకు గాను నాని ఉత్తమనటుడిగా ఎంపికైతే.. 2013కు గాను 'మిర్చి' సినిమాలో నటనకు గాను ప్రభాస్ ఉత్తమ నటుడిగా నంది అవార్డుకు ఎంపికైయ్యాడు. అటు ప్రభాస్‌కు ఈ అవార్డు రావడంపై రచ్చ నడిచింది. 'అత్తారింటికీ దారేది' సినిమాలో పవన్ కాదని ప్రభాస్ కు ఇవ్వడమేంటి అంటూ రచ్చ చేసారు ఫ్యాన్స్. ఆ తర్వాత కొన్ని రోజులకు 2014,2015,2016 మూడు సంవత్సరాలకు కలిపి నంది పురస్కారాలను ప్రకటించారు. ఈ సారి ఇంకా పెద్ద రచ్చ జరిగింది. లెజెండ్ సినిమాలో బాలయ్యకు నంది ఇచ్చారు. 2015లో ప్రభాస్ బాహుబలి కాదని మహేష్ 'శ్రీమంతుడు' సినిమాకు ఇచ్చారు. 2016లో ఎన్నో సినిమాలు ఉన్నా కూడా జనతా గ్యారేజ్ లో నటనకు ఎన్టీఆర్ నంది అందుకున్నాడు. ఈ ముగ్గురికి టీడీపీతో అనుబంధం ఉండటంపై ఈ అవార్డుల ప్రకటనపై పెద్ద దుమారమే రేగింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ నంది అవార్డుల పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని వాయిదా వేసారు. ఇప్పటికీ ఆ అవార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఈ అవార్డులు ఇస్తారా లేదంటే జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్‌సీపీ మళ్లీ కొత్త అవార్డులు ప్రకటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇస్తే.. ముఖ్యమంత్రి హోదాలో జగన్ చేతులు మీదుగా ప్రభాస్, బాలకృష్ణ సహా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, నాని అందుకోవాల్సి వస్తోంది. అది అభిమానులకు పండగే. 
 

More Related Stories