English   

మెగాస్టార్ కి అబద్దం చెప్పిన దేవిశ్రీప్రసాద్‌  

Koratala Siva
2019-10-14 15:02:34

మెగా ఫ్యామిలీకి దేవిశ్రీప్రసాద్‌ అదిరిపోయే పాటలు అందించాడు. చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్‌ 150 అంత పెద్ద హిట్‌ అవడంలో దేవి ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే రామ్‌ చరణ్‌ కెరియర్‌లో అతి పెద్ద విజయంగా నిలిచిన 'రంగస్థలం కూడా దేవి పాటల వల్ల మరో రేంజ్ కి వెళ్ళింది.  అయితే ఈ మధ్య కాలంలో దేవిశ్రీప్రసాద్‌ని మెగా ఫ్యామిలీ ఎందుకో ఎంటర్‌టైన్‌ చేయడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఏమిటనేది తెలియదు కానీ చిరంజీవి తాజా సినిమా క్రూ లో దేవిశ్రీప్రసాద్‌ పేరు లేకపోవడం చర్చనీయాంశమయింది. 

వేరే దర్శకుడి సినిమా అయితే పెద్దగా టాపిక్‌ అయ్యేది కాదు కానీ కొరటాల శివ ఇంతవరకు తీసిన సినిమాలు అన్నిటికీ దేవిశ్రీప్రసాద్‌ సంగీత దర్శకుడు. కానీ ఈసారి ఓపెనింగ్‌లో కూడా దేవి పేరు ప్రకటించలేదు. మిగతా టెక్నీషియన్లని ఫైనలైజ్‌ చేసేసినా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయం బయటకి రానీయలేదు. అయితే తాజాగా సైరా విషయంలో దేవి శ్రీ మెగా స్టార్ కి అబద్దం చెప్పాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎందుకంటే సైరా నరసింహా రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుద్ మెగాస్టార్ ఒక ప్రెస్ మీట్‌లో సినిమా విడుదలైన రోజు తాను పడిన టెన్షన్ గుర్తు చేసుకున్నారు. 

ముఖ్యంగా అక్టోబర్ 2 రాత్రి 2.30 నిమిషాలకు దేవీ శ్రీ ప్రసాద్ నుంచి మెసేజ్ వచ్చిందని అప్పుడే ఫస్టాఫ్ పూర్తి చేసుకున్న తర్వాత అద్భుతంగా ఉందంటూ కాల్ చేసి చెప్పాడని తెలిపాడు చిరంజీవి. ఆ తర్వాత సెకండాఫ్ చూసి మళ్లీ ఫోన్ చేయలేదని చెప్పాడు. దేవీతో పాటు తనకు రెగ్యులర్‌గా రావాల్సిన కొన్ని కాల్స్ కూడా రాలేదని ఉదయం 7 అవుతున్నా కూడా ఒక్కరు కూడా ఫోన్ చేయకపోయేసరికి తనకు టెన్షన్ పెరిగిపోయిందని చెప్పుకొచ్చాడు.  అయితే ఈ విషయానికి పూర్తి విరుద్దంగా దేవి శ్రీ నిన్న ట్వీట్ చేశాడు. అదేంటంటే ఇప్పుడే ఇండియా వచ్చానని తీరిక చేసుకుని సినిమా చూశానని చెబుతూ ఫ్యామిలీతో ఉన్న పిక్స్ పెట్టాడు. ఈ క్రమంలో చిరు అబద్దం చెప్పాడా ? లేక చూడలేదంటే బాగోదేమోనని దేవి శ్రీ అబద్దం చెప్పాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

More Related Stories