English   

జెర్సీ రీమేక్ చేస్తున్న కబీర్ సింగ్.. దర్శకుడు ఎవరంటే..

Jersey Remake
2019-10-14 15:46:22

జెర్సీ సినిమా తెలుగులో ఎలాంటి విజయం సాధించిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరసగా రెండు ఫ్లాపుల్లో ఉన్న నానికి అద్భుతమైన పేరుతో పాటు విజయాన్ని కూడా తీసుకొచ్చింది ఈ చిత్రం. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీకి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంతో నాని కూడా తనెలాంటి నటుడో.. ఎంత స్థాయి ఉందో మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అక్కడ కూడా ఒరిజినల్ తెరకెక్కించిన గౌతమ్ దర్శకుడు. తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ కూడా చేసాడు. అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని హిందీలో నిర్మిస్తుండటం విశేషం. అమన్ గిల్ కూడా ఈ ఇద్దరితో జోడీగా ఉన్నాడు. నాని లాంటి హీరోను రీ ప్లేస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అది సాహసం అని తెలిసినా కూడా ఇప్పుడు దాన్ని చాలెంజ్ మాదిరే తీసుకుంటున్నాడు షాహిద్ కపూర్. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తర్వాత మరోసారి తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు ఈయన. త్వరలోనే జెర్సీ హిందీ రీమేక్ పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాది ఎప్రిల్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. కచ్చితంగా తెలుగులో సంచలన విజయం సాధించిన జెర్సీ.. హిందీలోనే అదే రిపీట్ చేస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు

More Related Stories