English   

జగన్, చిరంజీవి భేటీ.. మీటింగ్ వెనక మ్యాటర్ ఏంటంటే..

 chiranjeevi
2019-10-14 15:54:18

ఇప్పుడు ఇండస్ట్రీలో దీనిపైనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన మెగాస్టార్.. ఇప్పుడు మళ్లీ అటు వైపు అడుగేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అందులోనూ అధికార పార్టీలో ఆయన అడుగు పెట్టబోతున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. జగన్ తో ఆయన మీటింగ్ కేవలం సినిమా కోసమే అని.. ఎలాంటి రాజకీయాలు ఉండబోవని ఇప్పటికే బొత్స కన్ఫర్మ్ చేసారు. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయింది. ముఖ్యంగా జగన్ ను చిరు కలిసి కారణం కూడా స్టూడియో కోసం అని తెలుస్తుంది. ఏపీలో స్టూడియో కట్టడానికి స్థలంతో పాటు జగన్ అనుమతి కోసం చిరు ప్రత్యేకంగా భేటీ అయ్యాడని తెలుస్తుంది. అక్కడికి వెళ్లిన వెంటనే జగన్ కుటుంబం చిరంజీవి దంపతులను మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చిన వెంటనే జగన్ కు శాలువా.. భారతికి చీర ఇచ్చారు చిరు దంపతులు. ఆ తర్వాత జగన్ ఆథిత్యాన్ని స్వీకరించారు. ఈ భేటీలో ముఖ్యంగా స్టూడియో నిర్మాణం గురించి చర్చకు వచ్చిందని.. దానికి మీ పర్మిషన్ కావాలంటూ జగన్ ను చిరు కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికితోడు చిరంజీవి వైసీపీలోకి వెళ్లబోతున్నాడని ప్రచారం కూడా జరుగుతుంది. ఈయనకు రాజ్యసభ సీట్ ఆఫర్ చేసారని.. ఇంకా చిరు వైపు నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదని తెలుస్తుంది. కానీ జగన్ మాత్రం ఎలాగైనా తన పార్టీలోకి మెగాస్టార్ ను తీసుకోవాలని చూస్తున్నాడు. ఆయన నిర్ణయం కోసం వేచి చూస్తున్నాడు. అందుకే చిరు మీటింగ్ కోసం అడిగిన వెంటనే జగన్ కూడా నో అనకుండా అప్పాయింట్మెంట్ ఇచ్చేసాడు. మొత్తానికి చూడాలిక.. భేటీ తర్వాత పూర్తి వివరాలు బయటికి వస్తే ఏం జరిగిందనేది ఇంకా క్లారిటీ వస్తుంది.

More Related Stories