English   

వైఎస్ జగన్‌తో చిరంజీవి భేటిలో చర్చించిన ప్రధాన అంశాలివే..

jagan
2019-10-14 20:51:33

సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు సమావేశం కావడం సర్వత్రా ఆసక్తి పెంచేసింది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి ఉన్నట్లుండి సతీ సమేతంగా జగన్ దంపతులను కలవడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. వాళ్లు కూడా చిరు దంపతులను సాదరంగా ఆహ్వానించారు. తమ విందు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వారం రోజుల కిందే సెట్ అయిన మీటింగ్ ఇది. ఇంతకీ ఇందులో ఏం మాట్లాడారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ సీఎం అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు వచ్చి కలిసింది లేదు. ఇది కూడా ముందు నుంచి ఇండస్ట్రీపై జగన్ కు కోపం తెప్పించే అంశమే. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ పెద్దదిక్కుగా భావించే చిరంజీవి వచ్చి స్వయంగా జగన్ ను కలవడంతో ఆ కోపం కూడా పోయిందనే అనుకుంటున్నారంతా.

మొత్తానికి ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చించుకున్నట్లు తెలుస్తుంది. దానికితోడు తను నటించిన సైరా సినిమాను చూడాలని జగన్ ను చిరు కోరినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే సైరా సినిమాకు రోజుకు 6 షోలు వేసుకోడానికి అనుమతినిచ్చినందుకు ఏపీ సిఎంకు చిరంజీవి కృతజ్ఞతలు కూడా తెలిపాడు. దాంతోపాటు ఏపీలోని కాపు నేతలను వైసీపీకి అనుకూలంగా మలుచుకునే విషయంపైనా కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా రోజుల నుంచి కాపు సామాజిక వర్గాన్ని తమ పార్టీకి చేరువగా చేసేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలో జగన్, చిరంజీవి భేటీ మరింత ఆసక్తి పెంచేసింది. మొత్తానికి జగన్ ను కలిసిన తర్వాత చిరు కూడా మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. తను ఫార్మల్ గానే కలిసానంటూ చెప్పుకొచ్చాడు. పైగా ఈ మీటింగ్ లో పాలిటిక్స్ కూడా ఏం లేవని మంత్రి బొత్స కూడా క్లారిటీ ఇచ్చాడు. మరి జగన్, చిరంజీవిలలో ఎవరో ఒకరు వచ్చి చెప్తే కానీ ఇక్కడ జరిగిందేంటో తెలియదు.

More Related Stories