English   

రానా ఆరోగ్యంపై పూర్తి క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు..

rana
2019-10-15 05:20:13

కొన్ని రోజులుగా రానా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎవరికి తోచినట్లుగా వాళ్లు వార్తలు రాస్తూనే ఉన్నారు. దీనిపై ఇటు రానా కానీ.. అటు సురేష్ బాబు కానీ ఎక్కడా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు సమయం వచ్చేసింది. రోజురోజుకీ వార్తలు ఎక్కువైపోతుండటంతో ఇప్పుడు తనయుడి ఆరోగ్యంపై సురేష్ బాబు నోరు విప్పాడు. దానికితోడు సన్నబడిన రానా ఫోటోలు చూసి అంతా షాక్ అవుతున్నారు. నిజంగానే రానాకు ఏదో అనారోగ్యం ఉందని.. కావాలనే అది బయటికి చెప్పకుండా దాచేస్తున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు దీనిపై కూడా తండ్రి సురేష్ బాబు క్లారిటీ ఇచ్చేసాడు. రానాకు చిన్ననాటి నుంచి ఉన్న అనారోగ్య సమస్యల గురించి తండ్రి సురేష్ బాబు కొన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు.

నిజానికి చిన్ననాటి నుంచే రానాకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయని ఒప్పుకున్నాడు సురేష్. కంటి సమస్య చిన్నపుడే మొదలైందని.. పెద్దయ్యాక ఆ కంటికి ఆపరేషన్ చేయిస్తే మంచిదని డాక్టర్లు చెప్పడంతో ఇన్నేళ్లూ ఆగామని చెప్పాడు ఈయన. ఇటీవల రానాకు డాక్టర్ల సూచన మేరకు కంటికి శస్త్రచికిత్స జరిగిందని.. అయితే చికిత్స తర్వాత తనకు ఆ టెన్షన్ తట్టుకోలేక బిపి లాంటి కంట్రోల్ తప్పిపోయానని.. అందుకే ఇలా మారిపోయాడని చెప్పాడు. అతి త్వరలోనే అంతా సెట్ అవుతుందని.. ఇదివరకు మీరు చూసిన రానా మళ్లీ అందరి ముందుకు వస్తాడని ధీమాగా చెబుతున్నాడు సురేష్ బాబు. కచ్చితంగా ఆయన కోరిక మేరకే కాదు.. అభిమానుల ఆశీస్సులు కూడా ఎప్పుడూ రానా వెంటే ఉంటాయి. కచ్చితంగా ఆయన పూర్తి ఆరోగ్యవంతుడిగా రావాలని భగవంతున్ని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం విరాటపర్వం సినిమాతో పాటు మరో అరడజన్ సినిమాలకు కమిటయ్యాడు.

More Related Stories