English   

పూజా హెగ్డే ఇంతకీ ఐటం గాళా.. హీరోయిన్‌నా..

pooja
2019-10-15 05:31:45

ఇప్పుడు పూజా హేగ్డే తీరు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం వస్తుంది. స్టార్ హీరోయిన్లు ఐటం సాంగ్స్ చేయొద్దని కాదు కానీ అలా చేస్తూ పోతే చివరికి ఐటం గాళ్ గా మిగిలిపోతారేమో అనే భయం ఫ్యాన్స్ లో కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు శ్రీయ ఇలా చేసి తన కెరీర్ ను తానే చేతులారా నాశనం చేసుకుంది. వరస అవకాశాలు వస్తున్న సమయంలోనే ఐటం సాంగ్స్ కూడా చేసింది శ్రీయ. ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయి ఐటం సాంగ్ ఆఫర్స్ పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు పూజా కూడా ఇదే చేస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పటికే రంగస్థలం సినిమాలో అదిరిపోయే జిగేల్ రాణిగా అందరి మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫాలోయింగ్ యూజ్ చేసుకుంటూ ఇప్పుడు మరిన్ని సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేయడానికి సై అనేస్తుంది పూజా.

ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూనే.. అదే సంక్రాంతికి బన్నీతో పోటీ పడుతున్న మహేష్ బాబు సరిలేరు నేనీకెవ్వరు సినిమాలో ఐటెం గాళ్‌గా చిందేస్తోంది ఈ భామ. రెండు సినిమాలు సంక్రాంతికి తనవే అంటుంది పూజా. ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ సినిమాలో కూడా పూజానే హీరోయిన్. దాంతో పాటు అఖిల్ సినిమాలోనూ ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. మొత్తానికి అటు హీరోయిన్.. ఇటు ఐటం గాళ్ గా వరస అవకాశాలు అందుకుంటూ రెండు చేతులా సంపాదించేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

More Related Stories