English   

విజయ్ బిగిల్ సినిమా సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటో తెలుసా..

bigil
2019-10-15 19:14:15

విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా బిగిల్. దివాళి కానుకగా విడుదల కానుంది ఈ చిత్రం. తెరీ, మెర్సల్ తర్వాత అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ నటించిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాపై తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ అంచనాలున్నాయి. ఇక విడుదలకు 10 రోజుల ముందే సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. దీనికి యు బై ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. 2 గంటల 53 నిమిషాల నిడివితో విజయ్ సినిమా వస్తుంది. ఇది కాస్త ఎక్కువ నిడివి అయినా కూడా కచ్చితంగా ప్రేక్షకులను అలరించే అంశాలు సినిమాలో చాలానే ఉన్నాయంటున్నాడు అట్లీ కుమార్. ఈ చిత్రంలో ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు విజయ్. దాంతోపాటు మరో మాస్ కారెక్టర్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.

అన్నింటికి మించి నయనతార హీరోయిన్ కావడం తెలుగులో కలిసిరానుంది. ఇక సినిమాలో కూడా మరోసారి సందేశాన్ని జోడించి తీసుకొస్తున్నాడు అట్లీ కుమార్. ఈ సారి స్పోర్ట్స్ నేపథ్యంలో జరుగుతున్న అక్రమాలపై కథ రాసుకున్నాడు ఈయన. మెర్సల్ లో మెడికల్ స్కామ్స్ గురించి చూపించిన అట్లీ కుమార్ ఇప్పుడు స్పోర్ట్స్ పై పడుతున్నాడు. కచ్చితంగా ఈ చిత్రం తమిళనాట మరో సంచలన విజయం అందుకుంటుందని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్ తో తెరీ, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత అట్లీ చేస్తున్న సినిమా ఇది. తెలుగులో కూడా ఈ చిత్ర బిజినెస్ భారీగానే జరుగుతుంది. దీవాళికి ఇక్కడ కూడా విడుదల కానుంది విజిల్. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉండటంతో పండగ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

More Related Stories