English   

మహేష్ బాబు, అల్లు అర్జున్ గొడవ మామూలుగా లేదుగా..

alluvsmahesh
2019-10-15 19:37:03

ఇప్పుడు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా వీళ్ళ వార్ ఆశ్చర్యపరుస్తుంది. ఒకర్ని మించి మరొకరు తమ సినిమా అప్ డేట్స్ ఇస్తున్నారు. బన్నీ అనౌన్స్ చేసిన కాసేపటికే మహేష్ బాబు కూడా తన సినిమా జనవరి 12న వస్తుందని ప్రకటించాడు. ఈ వార్ చూసి నిజంగానే అంతా షాక్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఏ ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఇలా బాక్సాఫీస్ వార్ కు సై అంటే సై అనలేదు. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. జనవరి 12న అల వైకుంఠపురములో సినిమాతో పాటు సరిలేరు నీకెవ్వరు కూడా వస్తుంది. అయితే ఇప్పుడు టీజర్ కూడా రెండూ ఓకేరోజు రానున్నాయని తెలుస్తుంది. ఇది కూడా కావాలనే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక్కడ మహేష్ బాబు పంతం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతుంది.

తన సినిమా సంక్రాంతికి వస్తుందని ఓపెనింగ్ రోజే అనౌన్స్ చేసినా కూడా కనీసం తమను ఒక్కమాట కూడా అడక్కుండా బన్నీ తన సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయడం మహేష్ బాబుకు అస్సలు నచ్చలేదని.. అందుకే ఎంత దూరమైనా వెళ్లడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నాడని ఇండస్ట్రీ ప్రచారం జరుగుతుంది. సంక్రాంతికి మరో భారీ సినిమా వస్తుందని తెలిసినపుడు కనీసం ఓ మాట అడిగితే పోయేదేం లేదు కదా అని మహేష్ నే సపోర్ట్ చేస్తున్నారు విశ్లేషకులు కూడా. అందుకే ఇప్పట్నుంచి బన్నీ ఏం చేసినా కూడా దానికి కౌంటర్ గా తన సినిమా అప్ డేట్స్ కూడా విడుదల చేయాలని చూస్తున్నాడు సూపర్ స్టార్. మరి ఈ వార్ ఎలా ఉండబోతుందో చూడాలిక.

More Related Stories