English   

రజినీకాంత్ ఫ్యాన్స్ కు నిద్ర లేకుండా చేస్తున్న విజయ్..

vijay
2019-10-16 05:05:41

తమిళనాట రజినీకాంత్ హవా తగ్గిపోతుంది. మెల్లగా విజయ్ తన స్టామినా పెంచుకుంటున్నాడు. ఇది కొన్నేళ్లుగా కనిపిస్తూనే ఉంది. వరస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు రేపుతున్నాడు ఈయన. ఇక ఇప్పుడు ఇళయదళపతి మరో సంచలనానికి తెర తీస్తున్నాడు. ప్రస్తుతం 'బిగిల్' సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన. దీపావళికి సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు విజయ్. ఇప్పటి వరకు సౌత్ హీరోలు కలలు కంటున్న ఫిగర్ అది. ఈ చిత్రానికి ఏకంగా 40 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు విజయ్. గతంలో 25 కోట్ల వరకు తీసుకున్న విజయ్..

ఇప్పుడు ఏకంగా మరో 15 కోట్లు పెంచేసాడు. ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేస్తున్న మ్యాజిక్ కూడా అలాగే ఉన్నాయి. 200 కోట్లను కూడా ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. సర్కార్ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుని సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న బిగిల్ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అట్లీకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళనాటే కాదు తెలుగులో కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. తెరీ, మెర్సల్ సినమాల తర్వాత అట్లీతో విజయ్ చేస్తున్న సినిమా ఇది. మొత్తానికి చూడాలిక.. ఈ సినిమాతో విజయ్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో..? అన్నట్లు ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.

More Related Stories