English   

దేవుడా.. వెంకటేష్, బాలకృష్ణ కూడా పండక్కే వస్తున్నారంట..

Balakrishna Venkatesh.jpg
2019-10-16 08:21:58

సంక్రాంతి సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు.. వ‌ర‌స‌గా సినిమాలు వ‌చ్చేస్తుంటాయి. ఈ సారి కూడా ఇదే జ‌రుగుతుంది. 2019 సంక్రాంతికి నాలుగు సినిమాలు వ‌చ్చాయి. అందులో ఎఫ్ 2 సినిమా మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఆ సినిమాతో పాటు వ‌చ్చిన విన‌య విధేయ రామ‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, పేట సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకేసారి ఇన్నిసినిమాలు రావ‌డం కూడా దీనికి శాపంగా మారిపోయింది.

ఇక ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. 2020 సంక్రాంతికి కూడా 4 సినిమాలు రానున్నాయి. అందులో అంతా స్టార్ హీరోలే ఉండ‌టం విశేషం. నాగార్జున బంగార్రాజు సినిమా కూడా ముందు సంక్రాంతికి ప్లాన్ చేసిన ఇప్పటి వరకు షూటింగ్ కూడా మొదలు కాలేదు. ఇదిలా ఉంటే మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు కూడా సంక్రాంతి పండ‌క్కే రానుంది. ఈ సినిమాను జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తున్నాడు దిల్ రాజు. ఆయ‌న‌కు ఆ తేదీ కూడా బాగానే క‌లిసొచ్చింది.

ఇక త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కిస్తున్న అల వైకుంఠపురములో సినిమాను పండ‌క్కి.. పైగా జనవరి 12నే విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి14న వెంకీ మామా కూడా విడుదల కానుంది. ఇక బాలయ్య కూడా తన రూలర్ సినిమా సంక్రాంతి విడుదలకు ప్లాన్. చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలతో పాటు రజినీకాంత్ దర్బార్ కూడా సంక్రాంతికే విడుదల కానుంది. ఒకేసారి 6 పెద్ద సినిమాలు వ‌స్తే క‌చ్చితంగా అది క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని తెలిసినా కూడా ఎవ‌రికి ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. మ‌రి చూడాలిక‌.. చివ‌రివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో..? 

More Related Stories