English   

కొత్త కొత్తగా ఉన్నది అంటున్న రామ్, కిషోర్ తిరుమల..

Hero Ram Director Kishore Thirumala.jpg
2019-10-16 09:33:54

సాధారణంగా బ్లాక్ బస్టర్ సినిమా వస్తే హీరోలు పండగ చేసుకుంటారు అనుకుంటారు కానీ అది నిజం కాదు. టెన్షన్ తో చచ్చిపోతారు. ఇప్పుడు రామ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఏం చేయాలో తెలియక దిమాక్ ఖరాబ్ చేసుకుంటున్నాడు ఈయన.

ఈ సినిమా వచ్చి 75 రోజులు అయిపోయినా కూడా ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు రామ్. మరోవైపు పూరీ మాత్రం విజయ్ దేవరకొండతో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈ కాంబినేషన్ లో సినిమా త్వరలోనే మొదలు కానుంది. కానీ రామ్ మాత్రం నెక్ట్స్ సినిమాపై కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకోవడం ఈయనకు బాగా అలవాటు. ప్రతీసారి ఇదే చేస్తాడు.. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు.

పూరీ సినిమా తర్వాత ఈయనకు ఎలాంటి సినిమా చేయాలనే క్లారిటీ లేకుండా పోయింది. అంత మాస్ సినిమా తర్వాత లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అయితే రామ్ చేస్తున్నాడు కానీ అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియదు. ప్రస్తుతానికి ఓ తమిళ్ రీమేక్ సెట్ చేసుకున్నాడు రామ్. అక్కడ మంచి విజయం సాధించిన తడం సినిమాను రిమేక్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ కథను రామ్ ఇమేజ్ కు తగ్గట్టు మారుస్తున్నాడు కిషోర్. నవంబర్ రెండో వారంలో షూటింగ్ మొదలు కానుంది.

More Related Stories