English   

మరో పవర్ ఫుల్  రోల్ లో రమ్యకృష్ణ

 Ramya Krishna
2019-10-16 10:51:20

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కుమారుడు ఆకాష్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రొమాంటిక్‌. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కథ - మాటలు పూరి అందించగా, అనిల్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి కేతిక శర్మ అనే కొత్త ఢిల్లీ మోడల్ పరిచయమవుతోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫస్ట్‌లుక్‌ ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. 

దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇలాంటి సమయంలో నిన్న అగ్నిప్రమాదం సంభవించినట్లు బయటికి వచ్చిన ఓ వీడియో హల్చల్ చేసింది. అయితే దాని గురించి అసలు స్పందించని సినిమా యూనిట్, ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారని ప్రకటించింది. ఈరోజు నుండి ఆమె షూట్ కి కూడా హాజరవుతున్నట్టు ప్రకటించింది సినిమా యూనిట్. 

ఒక రకంగా రమ్యకృష్ణ కి బాహుబలి తర్వాత శైలజా రెడ్డి అల్లుడుతో ఫుల్ లెంగ్త్ రోల్ పడింది, అయినా ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రమ్యకృష్ణకి నిరాశే ఎదురయ్యింది. ఇక ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని, సినిమాలో అధిక భాగం రమ్యకృష్ణ కనిపిస్తారనీ, ఆమె పాత్రను పూరి గొప్పగా డిజైన్ చేశాడని అంటున్నారు. అయితే ఆమెది హీరో లోఎడా హీరోయిన్ తల్లి పాత్ర అయి ఉండచ్చని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  

More Related Stories