English   

వైరల్ గా మారిన భార్గవ్ రామ్ ఫోటో...ఎన్టీఆర్ మళ్ళీ పుట్టారా

 Jr NTR
2019-10-16 14:17:49

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాక ఆయనకి కుటుంబం మీద ప్రత్యేక శ్రద్ద పెరిగింది. ఇక ఎన్టీఆర్, లక్మీ ప్రణ‌తి దంపతులకి అభయ్ రామ్‌ అనే నాలుగేళ్ళ బాబు ఉండగా, గ‌త ఏడాది జూన్ 14న మ‌రో కుమారుడు జ‌న్మించగా ఆ చిన్నారికి భార్గవ్ రామ్ అని నామ‌క‌ర‌ణం చేసిన ఎన్టీఆర్ అప్పట్లో నలుగురూ కలిసి ఉన్న కంప్లీట్ ఫ్యామిలీ పిక్ కూడా షేర్ చేశాడు. అలాగే మొన్న పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ త‌న సోష‌ల్ మీడియాలో అన్నదమ్ములు కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశాడు. ఒక ఫోటోలో భార్గవ్‌ని ఎత్తుకొని ఎన్టీఆర్ ఉండ‌గా, మ‌రొక ఫోటోలో అభ‌య్, భార్గవ్‌లు ఇద్దరు క‌లిసి ఫోటోకి ఫోజిచ్చారు. 

అయితే ఇప్పుడు లీకయిన భార్గవ్ రామ్ పిక్ ఒకటి చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే ఈ పిక్ లో ఆ బుడ్డోడికి పెద్ద ఎన్టీఆర్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తల్లి లక్ష్మి ప్రణతి ఎత్తుకోగా ఏదో ప్రైవేట్ ఫంక్షన్లో క్లిక్ మనిపించిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నందమూరి అభిమానులు అయితే పెద్దాయన మళ్ళీ పుట్టాడని మురిసిపోతున్నారు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More Related Stories