English   

జెమినీ అత్యుత్సాహం....బాలయ్య అభిమానుల ఫైర్

Balayya
2019-10-16 15:01:09

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటిస్తోన్న 105వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సీ క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ‌తంలో సీ క‌ళ్యాణ్‌, కేఎస్‌.ర‌వికుమార్, బాల‌య్య కాంబోలో వ‌చ్చిన జై సింహా సినిమా 2018 సంక్రాంతికి వ‌చ్చి మ‌రీ హిట్ అయ్యింది. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌ హిట్ అవ్వడమే కాక నిర్మాతకు సైతం లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా తెర‌కెక్కనున్న సినిమాకి మొదట్లో ‘రూలర్’ అనే టైటిల్ నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమాకు ‘క్రాంతి’, ‘జడ్జిమెంట్’, ‘డిపార్ట్‌మెంట్’ లాంటి పేర్లను కూడా పరిశీలించారని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని ప్రకటించలేదు. కానీ ఈ సినిమా హక్కులు కొనుకున్న జెమినీ టీవీ మాత్రం ఈ టైటిల్ ని రివీల్ చేసింది. తాజాగా ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ టైటిల్ 'రూలర్' అనే సంగతిని చెప్పేశారు. టైటిల్ గురించిన అధికారిక ప్రకటన వెలువడకుండానే జెమినీ టీవీవారు ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం పట్ల బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదికలు లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుండగా ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి సెంటిమెంట్ ఉన్నా, ఇప్పటికే అక్కడ భారీగా జామ్ కావడంతో బాలయ్య డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేయనున్నాడు.

More Related Stories