English   

క్రిస్మస్ ని టార్గెట్ చేసిన మెగా హీరో...ఇట్స్ అఫీషియల్

Prati Roju Pandaage
2019-10-16 17:38:43

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “ప్రతి రోజు పండగే”. నిన్న సాయి తేజ్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ గ్లింప్జ్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ ఫస్ట్ గ్లింప్జ్ కలర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా ఫీల్ గుడ్ మ్యూజిక్ తో పాటు డీసెంట్ విజువల్స్ బాగుండటంతో ఈ ఫస్ట్ గ్లింప్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ధరమ్‌ తేజ్‌, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. 

పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సత్యరాజ్‌, విజయ కుమార్‌, రావు రమేష్‌, మురళీ శర్మ, అజరు, ప్రవీణ్‌, సత్యం రాజేష్‌, సత్య శ్రీనివాస్‌, సుభాష్‌, భరత్‌ రెడ్డి తదితరులు మరిన్ని పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని క్రిస్‌మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 20న విడుదల చేయనున్నామని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 

బడా సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేయడంతో మీడియం రేంజ్ మూవీస్ క్రిస్టమస్‌కి సందడి చేయటానికి సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్ మూవీ, సాయి తేజ్ 'ప్రతిరోజు పండగే' లాంటి సినిమాలు క్రిస్టమస్ ని బేస్ చేసుకుని రిలీజ్ కి సిద్దం అవుతున్నాయి. క్రిస్టమస్ సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమాలు డిసెంబర్ లో విడుదలకు ముస్తాబవుతున్నాయి.

More Related Stories