English   

ఆ సెన్సేషనల్ డైరెక్టర్ ఏమయ్యాడు

ajay
2019-10-16 19:38:30

మనకి కెరీర్ లో విజయాలు లేకున్నా ఏదో ఒక రోజు ఆ విజయం మనకు దక్కచ్చనే నమ్మకం ఉంటుంది. అయితే ఆ విజయాలు లేకపోయినా పర్లేదు  వివాదాలుంటే కెరీర్ ప్రశ్నార్ధకంగా మారడం ఖయాం. నటీనటుల విషయం ఎలా ఉన్నా బిగినింగ్ స్టేజ్‌లో ఉన్న డైరెక్టర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అజయ్ భూపతి మాత్రం అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుని కెరీర్‌నే ప్రమాదంలో పడేసుకున్నాడు. తన మొదటి సినిమా "ఆర్.ఎక్స్. హండ్రెడ్‌'తో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు అజయ్ భూపతి.

నితిన్, రామ్, లాంటి హీరోల నుంచి ఆఫర్స్ కూడా అందుకున్నాడు. అయితే వీళ్ల నుంచి ఆఫర్స్ వచ్చాయి కానీ ఆ ఆఫర్స్ ని పెట్టుకుని ప్రాజెక్టులు ఓకే చేసుకోలేక పోయాడు. అప్పటి నుంచి హీరోల కోసం తిరుగుతూనే ఉన్నాడు కానీ ఎవ్వరూ ఓకే చెప్పలేదు. అజయ్‌ భూపతి యంగ్‌ హీరో చైతూ మొదలు సీనియర్ హీరో రవితేజ వరకూ ఒకే కధ వినిపిస్తూ వెళ్లాడు. వీళ్లిద్దరి కాంబోలో "మహాసముద్రం' అనే సినిమా వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే తర్వాత ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్‌ పక్కకెళ్లిపోయింది. ఈలోపు అజయ్ భూపతి చీప్ స్టార్ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌తోనే ఈ దర్శకుడి కెరీర్‌ కూడా కష్టాల్లో పడింది. అజయ్ భూపతి చీప్ స్టార్ అనే ట్వీట్‌ ఇండస్ట్రీకి నెగటివ్‌గా వెళ్లింది.

ఈ దర్శకుడికి ఆటిట్యూడ్‌ ఎక్కువ అనే విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు చూసే హీరోలంతా ఈ దర్శకుడికి దూరంగా ఉంటున్నారట. దీంతో అజయ్ భూపతి నెక్ట్స్‌ మూవీ ఏంటన్నది బిగ్‌ క్వశ్చన్‌గా మారుతోంది. ఆయన రెండో సినిమా వదిలేసి మూడో సినిమా ప్రకటించాడు భవ్య క్రియేషన్స్ లో ఉండదనుందని, మరి ఆయన రెండో సినిమా ఏమిటా అనేది చిదంబర రహస్యంగా మారింది. తీసుకున్న అడ్వాన్స్ కోసం బలవంతం చేయగా భవ్యా నుండి అనౌన్స్మెంట్ ఇచ్చారు, కానీ ఆ సినిమాలో హీరో ఎవరో కూడా తెలియదు. చూడాలి మరి ఈ వర్మ శిష్యుడు ఎప్పటికి సెట్ అవుతాడో ?

More Related Stories