English   

హ్యాపీ బర్త్ డే కీర్తి సురేష్

 keerthi suresh
2019-10-17 09:26:46

మహానటి నటితో దక్షిణాదిలో ఆమెకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరుచుకున్న నటి కీర్తి సురేష్. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలే చేసిన ఆమె ఇప్పుడు నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. అతి తక్కువ సమయంలో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న కీర్తి 1992లో అక్టోబర్ 17న సురేష్, మేనక దంపతలకు జన్మించింది. తండ్రి మలయాళంలో పెద్ద దర్శక, నిర్మాత. తల్లి మేనక మలయాళంలో పెద్ద హీరోయిన్. ఇంట్లో సినీ వాతావరణం ఉండటంతో ఆటోమేటిగ్‌గా కీర్తి సురేష్ అడుగులు సినీ రంగంపై పడ్డాయి. 

2000 వ సంవత్సరంలో పైలట్ సినిమా ద్వారా మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్. బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించి 2013లో కళ్యాణి ప్రియదర్శన్ తండ్రి దర్శకత్వంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గీతాంజలి’ మూవీలో కథానాయికగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో నటిగా కీర్తి సురేష్ వెనుదిరిగి చూసుకోలేదు.ఒకవైపు మాతృభాష తమిళంలో నటిస్తూనే తమిళ, తెలుగు భాషల్లో తన లక్‌ను పరీక్షించుకుంది. 2015 వ సంవత్సరంలో నేను శైలజా సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

 ఆ సినిమా మంచి విజయం సాధించడంతో.. టాలీవుడ్ కన్ను కీర్తి సురేష్ పై పడింది.  అప్పటికే కీర్తి సురేష్ తమిళ సినిమాల్లో బిజీగా ఉండటంతో మరో తెలుగు సినిమా కోసం 2017 వరకు ఆగాల్సి వచ్చింది.  నాని హీరోగా వచ్చిన నేను లోకల్ సినిమాతో తిరిగి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి అదే ఏడాది ఏకంగా మూడో సినిమాతోనే పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా చేసింది. ఆ సినిమా పరాజయం పాలయ్యినప్పటికీ కీర్తి కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘మహానటి’ మూవీ నటిగా కీర్తి సురేష్  ప్రభను అమాంతం పెంచేసింది. 

'మహానటి' సినిమాకి గాను ఉత్తమనటిగా జాతీయ అవార్డు అందుకొని తన స్థాయిని మరింత పెంచుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న ఆమె తమిళంలో విజయ్ సినిమాలో కూడా నటిస్తోంది. అలానే మోహన్ లాల్ హీరోగా మలయాళంలో రూపొందుతోన్న సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. చిన్నవయసులోనే సావిత్రి పాత్ర చేసి అనేక ప్రసంశలు అందుకున్న ఆమె మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం.  
 

More Related Stories