డీ గ్లామర్ లుక్ లో కూడా గ్లామర్ తో కీర్తి సురేష్

కీర్తిసురేష్ కథానాయికగా నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘హైదరాబాద్ బ్లూస్’, ‘ఇక్బాల్’ వంటి ఇండిపెండెంట్ సినిమాలు తెరకెక్కించిన చిత్రాల దర్శకుడు నగేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోనర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాని సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా ఆర్జీవీ మేనకోడలు ప్రముఖ డిజైనర్ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
దిల్రాజుసమర్పణలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కీర్తిసురేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమె లుక్ ని యూనిట్ విడుదలచేసింది. ఇందులో ముక్కు పుడక, చేతికి వెండి కడియాలు ధరించి మెడలో పూసల దండతో డీ గ్లామర్ లుక్ లో కూడా చిరునవ్వులు చిందిస్తూ సరికొత్తగా మరింత గ్లామర్ తో కనిపిస్తోంది కీర్తిసురేష్. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమ అని చెబుతున్దడంతో ఆమె లుక్ అలా ఉండడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను నవంబర్ 11 నుంచి హైదరాబాద్‌లో తెరకెక్కిస్తారని అంటున్నారు. ఇక త్వరలో ఈ సినిమా నుండి ఫస్ట్‌లుక్, టైటిల్ విడుదలచేస్తారని అంటున్నారు.