English   

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ ఇద్దరు హీరోయిన్లదే హవా.. 

Rashmika
2019-10-17 13:32:17

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్లు అంటే తమన్నా, సమంత, రకుల్, అనుష్క ఇలా చాలా పేర్లు చెప్పే వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్లంతా ఓల్డ్ అయిపోయారు. ఇప్పుడు తెలుగులో కేవలం ఇద్దరు హీరోయిన్ల మధ్య మాత్రమే అగ్రస్థానం కోసం యుద్ధం జరుగుతుంది. వాళ్లే పూజాహెగ్డే, రష్మిక మందన. ఇప్పటికే పూజ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ టాప్ పొజిషన్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో ప్రభాస్, అఖిల్, అల్లు అర్జున్ సినిమాలున్నాయి. బన్నీతో నటిస్తున్న అల వైకుంఠపురంలో సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్, రాధా కృష్ణ కుమార్ సినిమాలో ఈమె విభిన్నమైన పాత్రలో నటించబోతోంది. ఈ చిత్ర షూటింగ్ సంక్రాంతికి మొదలు కానుంది. మరోవైపు రష్మిక మందన్న కూడా వరస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులో హీరోయిన్ గా నటిస్తోంది ఈమె. ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా వస్తున్న భీష్మ.. మరో రెండు సినిమాల్లో రష్మిక కమిట్ అయింది. ఇద్దరు హీరోయిన్ల జోరుకు అడ్డుకట్ట వేయడంలో మిగిలిన హీరోయిన్లు విఫలమవుతున్నారు. రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్లు సినిమాలు చేస్తున్నారు కానీ ఒకప్పటిలా దూకుడు చూపించలేకపోతున్నారు. ఇప్పుడు గాని పూజ హెగ్డే, రష్మిక మందన్న మరో రెండు హిట్లు కొట్టారంటే వీళ్లను అందుకోవడం కష్టమే. ఇప్పటికే మిగిలిన స్టార్ హీరోలకు కూడా ఇద్దరు ముద్దుగుమ్మలపై కన్ను పడింది. మరి చూడాలి రాబోయే కాలంలో ఏ భామ అగ్రస్థానాన్ని అందుకుంటుందో..? 

More Related Stories