English   

రీమేక్ తో మాయ చేయాలని చూస్తున్న క్రియేటివ్ డైరెక్టర్.. 

Krishna Vamsi Ranga Marthanda
2019-10-17 14:26:33

తెలుగు ఇండ‌స్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరు విన‌గానే ముందుగా గుర్తొచ్చే పేరు కృష్ణ‌వంశీ. ఆయ‌న సినిమా అలా ఉండేవి మ‌రి. ఆయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ఓ సింధూరం.. గులాబి.. నిన్నే పెళ్లాడ‌తా.. మురారి.. ఖ‌డ్గం.. చంద‌మామ.. ఇలాంటి సినిమాలన్నీ తీసింది ఒకే ద‌ర్శ‌కుడు అంటే న‌మ్మ‌డం క‌ష్టం. ఎందుకంటే వేటిక‌వే డిఫెరెంట్ జోన‌ర్ లో ఉన్న సంచ‌ల‌నాత్మ‌క సినిమాలు. కెరీర్ మొద‌లుపెట్టిన కొన్నేళ్ల‌లోనే ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసాడు కృష్ణ‌వంశీ. కానీ గ‌త కొన్నేళ్లుగా ఈయ‌న ప్రాభ‌వం త‌గ్గుతూ వ‌చ్చింది. ఇప్పుడు పూర్తిగా ప‌థ‌న‌మ‌య్యే దిశ‌కు వ‌చ్చేసింది. రెండేళ్ల కింద ఈయ‌న చేసిన న‌క్ష‌త్రం డిజాస్ట‌ర్ల‌కే డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రంతో కృష్ణ‌వంశీ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడ‌ని అత‌డి అభిమానులు ఆశ‌పడ్డారు. నిజంగానే అనిపించుకున్నాడు.. కానీ కేవీ ఈజ్ బ్యాక్ కాదు.. గో బ్యాక్ అని. 

సాయిధ‌రంతేజ్ లాంటి క్రేజీ హీరో ఉన్నా కూడా న‌క్ష‌త్రం క‌నీసం 5 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేదంటే కృష్ణ‌వంశీ స్థాయి ఎలా దిగ‌జారిందో అర్థం చేసు కోవ‌చ్చు. కానీ ఇప్ప‌టికీ ఈయ‌న్ని త‌క్కువ‌గా అంచ‌న వేయ‌డానికి లేదు. ప్ర‌స్తుతం ఈయన ఓ రీమేక్ సినిమాతో రాబోతున్నాడు. మరాఠీ క్లాసిక్ నటసామ్రాట్ సినిమాను తెలుగులో రంగమార్తండ పేరుతో రీమేక్ చేయబోతున్నాడు. పోస్టర్ పైనే తన సినిమా రీమేక్ అని చెప్పేసాడు కృష్ణవంశీ. ఈ సినిమాతో కచ్చితంగా మళ్లీ ఫామ్ లోకి వస్తానని చెబుతున్నాడు ఈయన. రీమేక్ సినిమాలు తనకు అచ్చిరావని ముందు నుంచి చెబుతుంటాడు ఈ దర్శకుడు. అప్పట్లో చంద్రలేఖ ఫ్లాప్ అయిన తీరు చూసి మళ్లీ రీమేక్స్ చేయనన్నాడు. కానీ ఇప్పుడు నటసామ్రాట్ బాగా నచ్చడంతో రంగమార్తండ అంటున్నాడు కేవీ. మరి ఈయన రేంజ్ కు ఈ చిత్రం సరిపోతుందో లేదో చూడాలిక. 


 

More Related Stories