English   

విడాకులు తీసుకున్న మంచు మనోజ్...అందుకే

 Manchu Manoj
2019-10-17 18:04:22

టాలీవుడ్ లో మరో సినిమా జంట విడిపోయింది. మంచు మోహన్ బాబు రెండో కొడుకు ప్రేమ పెళ్లి చేసుకున్న  మనోజ్ తన విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మంచు మనోజ్ విడాకులు తీసుకోబోతున్నారు.. ఆమె భార్య ప్రణతితో బోలెడు గొడవలంట..అంటూ గతేడాది వేసవి సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అప్పుడు ఇవి పనికి మాలిన రూమర్స్ మాత్రమే నేను నా భార్యతో హ్యాపీగా ఉన్నా అంటూ రూమర్స్‌కి చెక్ పెట్టారు మంచు మనోజ్. ‘ప్రణతి.. నా దేవత, ఆమెతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తల్ని కథనాలను నమ్మొద్దు. వాళ్ల బొంద.. రూమర్స్ పుట్టించే వాళ్లకు మా గురించి ఏం తెలుసు’ అంటూ విడాకుల వార్తల్ని ఖండించారు మంచు మనోజ్.  2015 లో ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. ప్రణతి రెడ్డి తన వదినకు బంధువు దాంతో ప్రణతి – మంచు మనోజ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక , సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నాడు ఈ హీరో దాంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని విడాకులు తీసుకుంటున్నారని వచ్చిన వార్తలని నిజం చేశాడు. తనకు సినిమాలని భార్యను మేనేజ్ చేయడం కష్టంగా ఉందని అందుకే తనకు విడాకులు తీసుకోక తప్పడం లేదంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు.

More Related Stories