English   

కీరవాణి చిన్నకొడుకు హీరోగా మైత్రీ మేకర్స్ సినిమా...క్రేజీ యా

keeravani
2019-10-17 18:50:30

చిత్రపరిశ్రమలో వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు చాలా కాలం నుంచి జరిగేదే. సీనియర్ హీరోల తనయులు .. దర్శక నిర్మాతల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. కానే ఈసారి కాస్త కొత్తగా సంగీత దర్శకుడు కీరవాణి ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడని కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రచారం నిజం అయ్యింది. రాజమౌళి సోదరుడు కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవ ఇప్పటికే తండ్రి వారసత్వాన్ని తీసుకుని పాటలు పాడుతుండగా.. మరో కొడుకు సింహాని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో హీరోగా పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది.

తాజాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన అనుభవం సింహాకి ఉంది. ఆయనే ఇప్పుడు హీరోగా లాంచ్ అవుతున్నాడు.  కీరవాణి పెద్ద కొడుకు సంగీత సారధ్యంలో చిన్న కొడుకు హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాని రితీష్ రానా అనే నూతన దర్శకుడు తెరాకేక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ లుక్ ఈరోజు విడుదల చేశారు. దానిని బట్టి చూస్తే ఈ సినిమాలో సింహా డెలివరీ బాయ్ గా నటించే అవకాశం కనిపిస్తోంది.

More Related Stories