English   

గర్భవతిగా మారిన కీర్తి సురేష్ 

Keerthy Suresh
2019-10-18 12:11:02

కెరీర్ మంచి ఊపు మీదున్నప్పుడు ప్రయోగాత్మక పాత్రలు చేయాలంటే కాస్త ధైర్యం ఉండాల్సిందే. కీర్తి సురేష్ ఇప్పుడు అలాంటి ప్రయోగాత్మక పాత్ర చేయడానికి సిద్దమయిపోయింది. మహానటి సినిమాతో జాతీయ నటిగా అవార్డ్ పొందిన కీర్తి సురేష్‌ తన గుర్తింపును కాపాడుకుంటూనే వైవిధ్యభరితమైన సినిమాలతో కెరీర్‌ను పరుగులు పెట్టించేందుకు సిద్ధమైంది.

 ప్రస్తుతం కీర్తి లిస్ట్ లో క్లాప్‌, రంగ్‌ దే, మిస్‌ ఇండియా సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. నిన్న కీర్తు పుట్టిన రోజు సందర్భంగా కార్తీక్‌ సుబ్బరాజు నిర్మిస్తోన్న సినిమా టైటిల్‌ పోస్టర్ ను రివీల్‌ చేశారు. ‘పెంగ్విన్‌’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తి ఓ ప్రయోగాత్మక పాత్రను పోషించబోతున్నట్లు పోస్టర్‌ ద్వారా అర్ధం అవుతుంది. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ లో కీర్తి డార్క్‌ షేడ్‌లో గర్భవతిగా ఉన్నట్టుగా దర్శనమిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఆమె రూపం పెంగ్విన్ పక్షిలా ఉంది. 

టైటిల్ లుక్‌లో తన గర్భంపై చేయి వేసి పర్వత ప్రాంతంలో నిలబడింది కీర్తి సురేష్. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఈ పోస్టర్ ద్వారానే దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ సినిమాని తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ మూవీని విడుదల చేయబోతున్నారు. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఎలా ఉండనుందో చూడాలంటే వచ్చే ఏడాది వేసవి దాకా ఆగాల్సిందే.

More Related Stories