English   

సాహో నిర్మాతల చీటింగ్...కేసు నమోదు

Saaho
2019-10-18 12:19:41

ప్రభాస్ హీరోగా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన భారీ సినిమా సాహో తెలిసిందే. ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటించిన ఈ సినిమాని యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. సుజిత్‌ దర్శకుడు. వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మాతలు. ఈ సినిమా నిర్మాతలపై నిన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన ఔట్ షైనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబందించిన బ్యాగుల్నీ తమ సినిమాలో ప్రమోట్ చేస్తామని చెప్పి.. సాహో నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ ఓ అగ్రిమెంట్ చేసుకుని ఆ తర్వాత దానిని పట్టించుకోలేదని కేసు నమోదు చేశారు ఆ సంస్థ ప్రతినిధులు. తమ సంస్థ తయారు చేసిన బ్యాగులను సాహో సినిమాలో హీరో, హీరోయిన్స్ వాడుతున్నట్టు చూపిస్తామని., ఆ బ్యాగులకు తగిన ప్రచారం కల్పిస్తామని గత ఏడాది జులై 8న సాహో నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారట. అందులో భాగంగా ఆ ఒప్పందం ప్రకారం రూ.0.38 లక్ష డబ్బు తీసుకున్న చిత్ర నిర్మాతలు సాహో సినిమాలో మా ప్రొడక్ట్స్‌ను చూపించకుండా మమ్మల్నీ మోసం చేశారని ఆరోపించారు. తమ బ్యాగులు చూపిస్తారని నమ్మి మరో కోటిన్నర పెట్టి సినిమాకి తమ బ్యాగులకి ఇంకా ప్రమోషన్స్ చేశామని సాహో చేతిలో మా బ్యాగ్స్ అంటూ ప్రచారం చేసుకుని తేరా సినిమాలో అవి లేకపోయేసరికి మార్కెట్ లో బ్యాడ్  అయ్యామని కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఆ బ్యాగుల సంస్థ నుండి అందుకున్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టనున్నామని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్‌  ఎస్‌.వెంకట్‌ రెడ్డి తెలిపారు. 

More Related Stories