English   

బాలయ్య దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన ఎన్టీఆర్

ntr
2019-10-19 08:03:55

ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఒక యూట్యూబ్ ఛానల్ నడపుతున్న సంగతి తెలిసిందే. పరచూరి పలుకులు అంటూ తన అనుభవాలను ఆయన పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా బాలయ్య - ఎన్టీఆర్ లు అసలు ఎలా కలిసారు అనే విషయం చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అల్లరి రాముడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఆ విషయాన్ని పరచూరి వివరించారు. అప్పటికే ఆది సినిమా విడుదలై మంచి విజయం సాధించిందని ఆ తర్వాత అల్లరిరాముడు సినిమాని పాలకొల్లులో షూట్ చేస్తున్నామని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

ఒక రోజు సెట్స్ లో మేము కూడా ఉన్నామని షాట్ గ్యాప్ లో చినరామయ్య(ఎన్టీఆర్) తో ఫ్యామిలీలో అందరితో మాట్లాడతావా అని అడిగామని, దానికి ఎన్టీఆర్ కళ్ళలో నీళ్లు కనిపించాయని, అలా ఏడుస్తూనే.. లేదండీ.. అందరి అభిమానుల్లాగే నాకు కూడా బాబాయ్(బాలకృష్ణ) అంటే ప్రాణం. కానీ ఆయనతోనే ఇప్పటిదాకా మాట్లాడలేదని చెప్పుకోచ్చారట. వెంటనే మేము ఫోన్ కలిపి ఇస్తాము మీ బాబాయ్ తో మాట్లాడమని చెప్తే ఎన్టీఆర్ కళ్ళ వెంట నీరు ఇంకా ఎక్కువయ్యాయని చెప్పుకొచ్చారు.

బాలయ్యకు ఫోన్ చేసి ఎన్టీఆర్ తో మాట్లాడండి అంటే వాడికిమ్మన్నారు, ఫోన్ ఇస్తే ఎన్టీఆర్ మాట్లాడకుండా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడని అన్నారు. బాలయ్య ఏమో వాడేందుకు అలా ఏడుస్తున్నాడు.. మీరైనా చెప్పండని అన్నారట. నాకు తెలిసి బాలయ్య, ఎన్టీఆర్ మాట్లాడుకోవడం అదే మొదటిసారి అని, ఆ తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపైన కనిపించాలని నిర్ణయించుకునిమ, అల్లరి రాముడు చిత్రం విడుదలయ్యాక ఓ అవార్డు ఫంక్షన్ జరిగితే ఆ వేడుకలో చినరామయ్యని బాలయ్య వద్దకు తీసుకెల్లమని చెప్పుకొచ్చారు. అక్కడ కూడా ఎన్టీఆర్ బాలయ్య చూసి ఎమోషన్ తో ఏడుస్తూనే ఉన్నాడని చెప్పుకొచ్చారు. 

More Related Stories