English   

లండన్ లో బాహుబలి టీమ్...అరుదైన గౌరవం

Bahubali Team
2019-10-19 11:23:09

బాహుబలి టీమ్ కొద్దిరోజుల క్రితం లండన్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ప్రభాస్, రానా, రాజమౌళి, అనుష్క మరియు నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ థియేటర్ లో ఈరోజు బాహుబలి ది బిగినింగ్ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఈ వేడుక ప్రతీ ఏడాది జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కొన్ని సినిమాలను ఎంపిక చేసుకుని అక్కడ ప్రదర్శిస్తారు. ఇప్పుడు బాహుబలి 2కు ఈ అవకాశం దక్కింది. ఓ తెలుగు సినిమాకు ఇలాంటి అరుదైన అవకాశం రావడం నిజంగానే గర్వకారణం. భారత చిత్ర పరిశ్రమ నుండి బాహుబలి సినిమాకు ఈ ఘనత దక్కడం విశేషం. ఈ ఏడాది గాను, బాహుబలి చిత్రం తో పాటు, హ్యారీ పోటర్, బాండ్ మూవీ స్కై ఫాల్ చిత్రాలు ఎంపిక అయ్యాయి. దీనితో చారిత్రాత్మక ఆల్బర్ట్ థియేటర్ లో ఆయా సినిమాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడ లైవ్ గా వాయించనున్నారు. ఇప్పటికే బాహుబ‌లి అన్ని దేశాల్లోనూ విడుదలైంది. అన్నిచోట్ల నుంచి మంచి స్పందనే అందుకుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన  ఆల్బర్ట్ థియేటర్ దశబ్దాలుగా అనేక సాంస్కృతిక, కళల ప్రదర్శనకు వేదికగా ఉంది. ఐతే లండన్ వెళ్లిన బాహుబలి టీమ్ లో కీలక వ్యక్తి అయిన కీరవాణి లేకపోవడం గమనార్హం.

More Related Stories