English   

శ్రీనివాస్ అవసరాల ఇకనుంచి నూటొక్క జిల్లాల అందగాడు.. 

SrinivasAvsarala
2019-10-19 14:41:08

శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. ఈ మ‌ధ్య ఏ సినిమాలో చూసినా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్. శ్రీ‌ని అని ముద్దుగా పిలుచుకునే అవ‌స‌రాల‌లో కేవ‌లం న‌టుడు మాత్రమే కాదు ద‌ర్శ‌కుడు కూడా ఉన్నాడ‌నే విష‌యం తెలిసిందే. గ‌తంలోనే ఊహ‌లు గుస‌గుస‌లాడే లాంటి స్వీట్ ల‌వ్ స్టోరీతో త‌న‌లోని ద‌ర్శ‌కుడిని బ‌య‌ట‌పెట్టాడు శ్రీ‌ని. ఈ సినిమా సూప‌ర్ స‌క్సెస్ అయినా.. వెంటవెంట‌నే సినిమాలు మాత్రం చేయ‌ట్లేదు శ్రీ‌నివాస్ అవ‌స‌రాల. అవ‌సరాలకు త‌గ్గ‌ట్లు ద‌ర్శ‌క‌త్వంలో నెమ్మదిగా.. న‌టుడి పాత్ర‌లో మాత్రం వేగంగా సినిమాలు చేస్తున్నాడు. జ్యో అచ్చుతానంద సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాతో దర్శకుడిగా వస్తున్నాడు శ్రీని. ఇక ఇప్పుడు హీరోగా మరో సినిమా చేయబోతున్నాడు. కొత్త దర్శకుడు సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నూటొక్క జిల్లాల అందగాడు అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. దానికితోడు క్రిష్ కూడా ఈ నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. కొత్త కాన్సెప్ట్‌ల‌ు వచ్చినపుడు మంచి కథలు వచ్చినపుడు నిర్మించడానికి తనకేం అభ్యంతరం లేదని ముందు నుంచి చెబుతున్నాడు దిల్ రాజు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయన. తాజాగా శ్రీనివాస్ అవసరాల హీరోగా కొత్త దర్శకుడు రాచ‌కొండ విద్యాసాగ‌ర్ తో ఈ `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వైవిధ్య‌మైన క‌థాంశంతో పూర్తిస్థాయి ఫన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా  ఈ సినిమా తెర‌కెక్కనుంది. అవ‌స‌రాల శ్రీనివాస్ కు జోడీగా చిలసౌ భామ రుహ‌నీ శ‌ర్మ నటించనుంది. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగ‌స్తి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. 

More Related Stories