English   

అందమైన నడుము మడతతో చంపేసిన రష్మీ గౌతమ్.. 

Anchor Rashmi
2019-10-19 17:09:35

మితిగా తింటే ఆహారం.. అతిగా తింటే విషం.. అందాల ఆర‌బోత‌లోనూ అంతే. అంతంత మాత్రంగా చూపిస్తేనే ఆవురావురమంటూ చూస్తారు. అలా కాద‌ని మొత్తం చూపించేస్తే చూడ్డానికి ఇంకేం ఉండ‌దు.. అస‌హ్యం త‌ప్ప‌. ఇప్పుడు ర‌ష్మిని చూస్తే ఇదే అనిపిస్తుంది. అప్పట్లో గుంటూర్ టాకీస్ తో సెక్సీ ఇమేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. అందం ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరసగా రెచ్చిపోతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. మరో పనేదీ పెట్టుకోకుండా సినిమా కథతో సంబంధం లేకుండా అందాల ఆరబోతతో నెట్టుకురావాలని చూస్తుంది రష్మి. అస్స‌లు త‌గ్గేదే లేద‌న్న‌ట్లు ఈ మ‌ధ్యే వ‌చ్చిన అంతం, రాణి గారి బంగ‌ళా, శివరంజని ఇలా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసింది. ఇప్పుడు కూడా మరో సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ. తన రెమ్యునరేషన్ తనకు వచ్చిందా లేదా అని చూసుకుంటుంది కానీ ఎలాంటి సినిమాలు చేస్తున్నాననే విషయాన్ని మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు ఈ బ్యూటీ. చూసుకున్నోళ్ల‌కు చూసుకున్నంత అంటూ గుంటూర్ టాకీస్ లోనే చూపించిన ర‌ష్మి.. ఇప్పుడు కెమెరాకు త‌న అందాల‌న్నీ బేరం పెట్టేసింది ఈ జ‌బ‌ర్ద‌స్థ్ పోరీ. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నాళ్ళైనా ఇంకా ఎవ్వ‌రూ త‌న‌ను ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే క‌సో.. లేదంటే వ‌చ్చిన అవకాశాన్ని ఎలాగైనా ఒడిసి ప‌ట్టుకోవాల‌నో తెగింపో తెలియ‌దు గానీ గుంటూర్ టాకీస్ లోనే బాగా రెచ్చిపోయింది ర‌ష్మి. ఓ సారి హ‌ద్దు దాటిన త‌ర్వాత మ‌ళ్లీ దాటితే ఏంటి అనుకుందో ఏమో.. ఇప్పుడు మరోసారి చీరకట్టులో చంపేసింది రష్మీ. కసిగా చూస్తూ నడుము మడతలతో ప్రాణాలు తీస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఫ‌స్ట్ టైమ్ కాబ‌ట్టి గుంటూర్ టాకీస్ కు ప్రేక్ష‌కులు బాగానే క‌నెక్ట్ అయ్యారు. కానీ ప్ర‌తీసారి అవే అందాలంటే ఎవ్వ‌రికైనా వెగ‌టు పుడుతుంది. ఇదే ఇప్పుడు ర‌ష్మి పాలిట శాపంగా మారుతోంది. మొత్తానికి అమ్మడి అందాలన్నీ అడవి కాచిన వెన్నెల అవుతున్నాయి. 

More Related Stories