పద్దతిగా చంపేసిన శర్వానంద్ హీరోయిన్..

శర్వానంద్ హీరోయిన్ ఏంటి.. పద్దతిగా చంపేయడం ఏంటి అనుకుంటున్నారా.. ఇంతకీ ఎవరా బ్యూటీ అని ఆలోచిస్తున్నారా..? ఒక్కసారి 12 ఏళ్లు కాలం వెనక్కి తిప్పితే సుర్వీన్ చావ్లా అనే ఓ పేరు గుర్తొస్తుంది. ఆ ముద్దుగుమ్మ తెలుగులో నటించింది ఒకే ఒక్క సినిమా.. అది కూడా రాజు మహరాజు. మోహన్ బాబు.. శర్వానంద్ హీరోలుగా వచ్చిన ఈ చిత్రంలో చాలా పద్దతిగా కనిపించింది సుర్వీన్. కానీ అసలు కారెక్టర్ ఆ తర్వాతే బయటపడింది. హేట్ స్టోరీ 2 తో సెక్స్ బాంబ్ లా పేలి అందరికీ షాకిచ్చింది. ఆ మధ్య తన బాయ్ ఫ్రెండ్ అక్షయ్ టక్కర్ ను పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైనా కూడా ఇప్పటికీ అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తుంది.
అప్పట్లో బికినీతో పాటు సముద్రంలో హాయిగా భర్తతో ఎంజాయ్ చేస్తోన్న హాట్ ఫోటోలు విడుదల చేసిన సుర్వీన్.. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ఇలా రెచ్చిపోతున్నావేంటి అని అడిగితే నా మొగుడికి లేని ప్రాబ్లమ్ మీకెందుకు అన్నట్లు మీడియాకు దిమ్మతిరిగిపోయే సమాధానం చెప్పింది సుర్వీన్. తర్వాత కూడా బ్లాక్ బికినీలో అమ్మడు అదిరిపోయే అందాల ప్రదర్శన చేసింది. ఇక ఇప్పుడు విడుదలైన ఫోటోషూట్ లో మాత్రం ఎందుకో మరి కాస్త పద్దతిగా కనిపించింది. అందాలను దాచుకుని ఎద అందాలను మాత్రమే కెమెరా ముందు పరిచేసింది సుర్వీన్. మొత్తానికి సుర్వీన్ చావ్లా గ్లామర్ షో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇండస్ట్రీలో. ఇది చూసిన తర్వాతైనా ఎవరో ఓ దర్శకుడు కరుణించకపోతాడా అని సుర్వీన్ ఆశ.