English   

ఆర్ఆర్ఆర్ రివీల్ ఆరోజేనా

rrr
2019-10-19 21:25:00

బాహుబలి లాంటి ప్రేస్టేజియస్ ప్రాజెక్ట్ తరవాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంతోంది. ఇక ఈసినిమాపై అప్పట్లో రాజమౌళి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. అయితే ఎంత క్లారిటీ ఇచ్చినా ఏదో ఒక కొత్త వార్త పుకారులాగా బయటకు వస్తూనే ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా టైటిల్ రివీల్ అయింది అంటూ ఒక టైటిల్ ని కూడా పుట్టించేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ పుకార్ల మీద వీటిపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయాడు జక్కన్న. ఈ నెల 22న కొమురం భీం జయంతి రోజున ఆ పాత్రలో కనిపించే తారక్‌ లుక్‌తో పాటుగా సినిమా టైటిల్‌ను కూడా రివీల్‌ చేయనున్నారనీ టాలీవుడ్‌ ఫిలిం నగర్ టాక్‌. మరి దీని పై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

More Related Stories