English   

రాజు గారి గది రెండ్రోజుల కలెక్షన్స్...

rgg3
2019-10-20 19:20:14

యాంకర్ గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ రాజు గారి గది సినిమాతో డైరెక్టర్ గా సత్తా చాటి వార్తల్లో నిలిచాడు. హర్రర్ కు కామెడీ మిక్స్ చేసి కమర్షియల్ హిట్ అందుకావడంతో దానికి సీక్వెల్ తీసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా దీనికి మూడో పార్ట్ గా రాజు గారి గది 3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకి మిక్సేడ్ టాక్ వచ్చింది. రొటిన్ కథ అని క్రిటిక్స్ తీసిపడేసినా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాలో కామెడీకి ఫిదా అయిపోతున్నారు.

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర రూ.1.3 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1.5 కోట్ల షేర్‌ను రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు రూ. 2.6 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక రెండో రోజు శనివారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టి 2.7 కోట్లతో షేర్, రూ.4.65 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.5.2 కోట్లకు అమ్ముడుపోయింది. దాంతో బ్రేక్ ఈవెన్ కి రూ.6 కోట్ల దాకా కలెక్ట్ చేయాలి. ఈరోజు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగుంటే అదేమీ పెద్ద విషయం కాదు. ఈ ఆదివారం ఆ కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

 

More Related Stories