English   

కష్టాల్లో గోపీ చంద్...రంగంలోకి ప్రభాస్

prabhas
2019-10-21 05:24:45

హీరో గోపీచంద్ గత కొంతకాలంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. రీసెంట్ గా చాణక్య సినిమాతో మళ్ళీ లైన్ లోకి వస్తాడు అనుకుంటే అది కూడా దేబ్బెసింది. దమ్ములేని కథ, లాజిల్ లేని టేకింగ్ కావడంతో ఊహించని ఫ్లాప్ ఫేస్ చేశాడు. చాణక్య రిలీజ్ కి ముందు ఉన్న హైప్ కి, ఈసారి గోపీచంద్ హిట్ కొట్టడం ఖాయమని సినీ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కానీ అది మళ్ళీ దేబ్బెసింది. ఇక ఇది ఎలాగూ హిట్ కొడతారు కాబట్టి గోపీచంద్ తో రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. ఆ రెండు సినిమాలు పూజా కార్యక్రమాల కూడా పూర్తి చేశాడు.

అందులో ఒకటి సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా కాగా మరొకటి బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ బ్యానర్ సినిమా. అయితే సంపత్ నంది సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతుంది కానీ ప్రసాద్ బ్యానర్ లో మొదలైన సినిమా మాత్రం ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎందుకంటే చాణక్య బెంచ్ మార్క్ కూడా అందుకోని కారణంగా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకునున్నారని అంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న  ప్రభాస్.. తన స్నేహితుడు గోపీచంద్ కెరీర్ నిలబెట్టడానికి ఇద్దరు ముగ్గురు బడా దర్శకులతో కథలను  రెడీ చేయిస్తున్నట్టు సమాచారం. ఆ రకంగా ప్లాపుల్లో ఉన్న గోపీచంద్‌ కు ప్రభాస్ అండగా నిలబడుతున్నాడన్న మాట.

More Related Stories