English   

మోడీకి డైరెక్టర్ పూరి లేఖ...ముందు దాని సంగతి చూడండి

 Puri Jagannadh
2019-10-21 11:22:16

భారత ప్రధాని నరేంద్ర మోడీకి పూరి జగన్నాధ్ బహిరంగ లేఖ రాశారు. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మోడీకి లేఖ రాయడం అంటే ఇదేదో తేడాగా ఉందే అనుకోవచ్చు. నిజానికి మొన్న మోడీ బాలీవుడ్ తారలతో ఒక స్పెషల్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దక్షిణాది మీద ఎందుకంత చిన్న చూపు అంటూ ఉపాసన రామ్ చరణ్ లాంటి వారు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పూరీ ఆ విషయంలో లేఖ రాశాడు అనుకుంటే పొరపాటే, పూరి ప్లాస్టిక్ నిషేధంపై మోడీకి కొన్ని సూచనలు చేశారు. 

నిజానికి రెండో మారు ప్రధాని అయ్యాక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే నిర్ణయానికి వచ్చారు.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక, తాజాగా, తమిళనాడు పర్యటనలో ఉన్న సందర్భంగా బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరి మరీ ప్రజల్లో ఈ విషయం మీద చర్చ జరిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే మోడీకి బహిరంగ లేఖ రాశారు టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ప్లాస్టిక్ నిషేధం ఆలోచనలో ఉన్న మోడీకి నేరుగా కొన్ని సూచనలు చేశారు. 

ప్రధానికి బహిరంగలేఖ రాసిన పూరీ ఆ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిగతా సమస్యలతో పోల్చుకుంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంత పెద్ద సమస్య కాదన్న తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. మిగిలిన సమస్యలతో పోల్చుకుంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంత పెద్ద సమస్య కాదని, ఇప్పుడున్న ప్లాస్టిక్ ని సరిగా వినియోగించుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. అంతేకాక ఇప్పటికిప్పుడు ప్లాస్టిక్ ని నిషేధిస్తే ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు ఉపయోగించాలని, వాటిని ఉత్పత్తి చేయాలంటే ఎన్ని చెట్లు నాశనం అవుతాయని పూరి గుర్తు చేశారు. ప్లాస్టిక్ వాడకం కన్నా వాహనాల నుంచి వచ్చే కాలుష్యమే అత్యంత ప్రమాదకరమన్న పూరి ముందు దీనిని నివారించే చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేకాక ఈ ప్లాస్టిక్ గురించి మరి కొన్ని సూచనలు కూడా పూరీ చేశారు.

More Related Stories