ఆమె ఎలిమినేషన్...ఫినాలేలో ఎవరో

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఆడుతూ పాడుతూ మొదలై చివరి దశకు కూడా చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో సింగిల్ డిజిట్ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఫినాలే వీక్ దగ్గర పడుతున్న నేపథ్యంలో హౌస్ లో ఎవరు మిగులుతారు, ఫైనల్స్ కు వెళ్ళేది ఎవరు, విజేత ఎవరు అనే ప్రశ్నలు షో ఫాలో అయ్యేవారు మొదలు అవని వారు కూడా చర్చించుకుంటున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం మీద ఆసక్తి నెలకొంది.
మొన్న ఏదో గొడవ జరగడంతో ఈ సారి హౌస్ సభ్యులను అందరినీ నామినేట్ చేశాడు బిగ్ బాస్, శనివారం రోజు బాబా భాస్కర్, రాహుల్, శ్రీముఖి సేవ్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఇక మిగిలిన వరుణ్, వితిక, అలీ రెజా, శివజ్యోతిలలో ఎలిమినేట్ అయ్యేది ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠ నెలకొనగా, వితిక ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించి ఆ టెన్సన్ కి తెరదించారు నాగార్జున. ఈ క్రమంలో ఇన్నాళ్ళు గిల్లికజ్జాలు ఆడుకుంటూ ఉన్న జంట విడిపోయినట్లయింది.
నిన్నటి ఎపిసోడ్ లో అందరికంటే ముందుగా శివజ్యోతి సేవ్ అయింది. అ ఆర్వాత అలీ రెజా సేవ్ అయ్యాడు. ఇక చివరకు వరుణ్, వితిక మిలిగారు. ఫైనల్ గా వితిక ఎలిమినేట్ అయింది. అయితే తన భార్య ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్ ఎమోషనల్ అయ్యాడు. వితికని కౌగలించుకుని కొంచెం సేపు వదలలేదు. వితిక కూడా కంటతడి పెట్టుకుంది. మిగిలిన హౌస్ మేట్స్ అంతా వితికకి సెండాఫ్ ఇచ్చారు. ఫినాలే దగ్గర పడడంతో ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే దాని మీద ఆసక్తి నెలకొంది.