English   

మా లో మళ్లీ రచ్చ.. పరుచూరి కంటతడి

Jeevitha Rajasekhar
2019-10-21 12:03:20

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" అంతర్గత తగాదాలు మరోమారు రచ్చకెక్కాయి. ప్రెసిడెంట్ గా గెలిచిన నరేష్ వర్గం, ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ వర్గం మధ్య ఇగో ఫీలింగ్స్ కూడా తారాస్థాయికి చేరాయని అంటున్నారు. అధ్యక్షడిగా నరేష్ కు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని అతడి వర్గం జీవిత రాజశేఖర్ పై ఆరోణలు చేస్తున్నారు.  ఈ వ్యవరాలపై చర్చించేందుకు నిన్న ఫిలిం ఛాంబర్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. మా అసోషషన్ లో ఈసీ మెంబర్ గా ఉన్న కమెడియన్ పృథ్వి సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. 

అంతేకాక మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 400 సినిమాలకు రచయితగా పనిచేసినపరుచూరి గోపాల కృష్ణ గారికి మీటింగ్ లో ఎవ్వరూ గౌరవం ఇవ్వలేదని, గొడవలు వద్దు అని ఆయన అరుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని అందుకే ఆయన కంటతడి పెట్టుకుందో మీటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయారని, తాను కూడా అది నచ్చక బయటకు వచ్చేశానని అవసరం అయితే ఈసీ మెంబర్ పదవికి రాజీనామా చేస్తానని కూడా పృథ్వి పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో కంటతడి పెట్టుకున్నారన్న వ్యాఖ్యల మీద పరుచూరి స్పందించారు. మీటింగ్ లో తనకు కొందరు సభ్యుల ప్రవర్తన నచ్చలేదని అన్నారు. 

అందుకే బయటకు వెళ్ళిపోయా. కానీ నేను కంటతడి పెట్టుకోలేదని క్లారిటీ ఇచ్చారు. నటుడు ఉత్తేజ్ కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావించారు. మా అసోసియేషన్ లో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని ఉత్తేజ్ అన్నారు. మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్‌ కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్.. నిన్న ఫిలిం ఛాంబర్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందుకే ఈ సమావేశంలో నరేష్ వర్గానికి, జీవితా రాజశేఖర్ వర్గానికి మధ్య మాటల యుద్ధం జరిగిందని తెలుస్తోంది. దాంతో కొంతమంది సభ్యులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారట.

More Related Stories