రష్మిక మందన్న విషయంలో దిల్ రాజు ఎందుకు హర్ట్ అయ్యాడు..

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఆ సినిమా తర్వాత అమ్మడుకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఇక ఛలో తర్వాత గీత గోవిందం కూడా బ్లాక్ బస్టర్ కావడంతో రష్మిక ఇమేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు ఈమె పారితోషికం కూడా అలాగే పెరిగిపోయింది. మధ్యలో వచ్చిన దేవదాస్, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు ఈమెకు వచ్చిన నష్టమైతే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తుంది రష్మిక. అందులో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఉంది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. దాంతో పాటు నితిన్ భీష్మ.. సుకుమార్, అల్లు అర్జున్ సినిమాల్లో కూడా నటిస్తుంది రష్మిక. ఇదిలా ఉంటే ఇప్పుడు తన రెమ్యునరేషన్ విషయంలో బాగా పర్టిక్యులర్ గా ఉంది ఈ ముద్దుగుమ్మ.
దీని గురించి కూడా ఓపెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఏంటి మేడమ్ పారితోషికం బాగా పెంచేసారట కదా అంటూ మీడియా మిత్రులు అడిగితే ఆసక్తికరమైన సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇన్నేళ్ల కెరీర్ లో ఎదుగుతున్నపుడు పారితోషికం పెంచడం కూడా సాధారణమైన విషయమే. ఎంత పెరిగితే తన ఎదుగుదల కూడా అంతే ఉన్నట్లు అని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో ఒక్కో సినిమాకు 40 లక్షలు తీసుకునే ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా కోటి దాటేసింది. ఇదే విషయంలో ఇప్పుడు దిల్ రాజుతో రష్మికకు సమస్య వచ్చిందని తెలుస్తుంది. నాగ చైతన్య హీరోగా కొత్త దర్శకుడు శశి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం రష్మికను హీరోయిన్ గా అడిగితే భరించలేనంత రెమ్యునరేషన్ చెప్పిందని తెలుస్తుంది. దాంతో పాటే జెర్సీ రీమేక్ లో షాహిద్ కపూర్ సరసన నటించడానికి కూడా భారీగానే పారితోషికం అడిగిందని.. దాంతో మరో హీరోయిన్ కోసం దిల్ రాజు చూస్తున్నాడని తెలుస్తుంది. మొత్తానికి దిల్ రాజు లాంటి నిర్మాతను కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతుంది రష్మిక మందన్న. మరి ఇది ఈమె కెరీర్ ను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలిక.