English   

ఈ సారి సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ నటుడి సినిమా కూడా

ajay
2019-10-22 04:56:55

ఇప్పటికే తెలుగు పరిశ్రమ సంక్రాంతి వార్ కి రెడీ అవ్వగా ఇప్పుడు బాలీవుడ్ కూడా మేమున్నామని రెడీ అయ్యింది. నిజానికి సంక్రాంతి అనగానే టాలీవుడ్, కోలీవుడ్ గుర్తుకు వస్తాయి.  సంక్రాంతి సీజన్లో ఈ రెండు సినిమా ఇండస్ట్రీల్లో ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. రానున్న సంక్రాంతికి టాలీవుడ్ లో నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతుండగా అందులో ఒకటి రజినీకాంత్ దర్బార్ కూడా ఉన్నది. రోబో తర్వాత నుండి రజినీకాంత్ సినిమా అంటే ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతూ వస్తోంది.

 సౌత్ భాషలతో పాటుగా, అటు హిందీలోను సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. దర్బార్ ముంబై బ్యాక్ డ్రాప్ సినిమా కాగా ఈ సినిమాకు ఇప్పుడు బాలీవుడ్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ హీరోగా తానాజీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి వెన్నుదన్నుగా నిలిచిన సైన్యాధిపతి తానాజీ మలుసరే జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తానాజీ పాత్రలో అజయ్‌ దేవగణ్‌ నటిస్తుండగా, ఆయన భార్య సావిత్రి మలుసరేగా అజయ్‌ నిజ జీవిత భాగస్వామి కాజోల్‌ కనిపించనుండటం విశేషం.

ఇందులో అజయ్‌ దేవగణ్‌తో తలపడే ప్రతినాయక పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. మొఘలుల సైనికాధికారి ఉదయ్‌ భన్‌ రాథోడ్‌ పాత్రలో కనిపించనున్నారు సైఫ్‌. తానాజీకి, రాథోడ్‌కు మధ్య జరిగిన సిన్హాఘడ్‌ యుద్ధం చరిత్రకెక్కింది. ఆ నేపథ్యాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు. ఈ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతున్నది.  జనవరి 10 వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అదే రోజున దర్బార్ కూడా రిలీజ్ అవుతున్నది. ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

More Related Stories